ఓట్ ఫస్ట్.. వర్క్ నెక్స్ట్: సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్
ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్
సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సైబరాబాద్ సీపీ
ఓట్ ఫస్ట్.. వర్క్ నెక్స్ట్ అని పిలుపు
నాంపల్లిలోని రెడ్ హిల్స్ ఎమ్ సీ హెచ్ సెంట్రల్ ఎమర్జెన్సీ Vote స్క్వాడ్ పోలింగ్ బూత్ వద్ద ఈరోజు ఉదయం సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గారు ఆయన సతీమని శ్రీ అనుప వీ సజ్జనార్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-అనంతరం సీపీ గారు మాట్లాడుతూ ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించండని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈరోజు ఎన్ని ఇతర పనులు ఉన్నప్పటికీ పట్ట భద్రులందరూ కచ్చితంగా తమ అమూల్యమైన ఓటు వేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
-పట్టభద్రుల/ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నిక్షల్లో పట్టభద్రులందరూ పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలన్నారు.
- ఎమ్ఎల్సీ ఎన్నిక్షల నేపథ్యంలో భద్రతాపరంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
- గ్రాడ్యుయేట్స్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
- పోలింగ్ స్టేషన్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.
-ఓట్ ఫస్ట్.. వర్క్ నెక్స్ట్ అనే నినాదంతో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజలందరూ పెద్దఎత్తున ముందుకు రావాలన్నారు.
-తాను ఓటు వేసిన రెడ్ హిల్స్ ఎం సీ హెచ్ ప్లే గ్రౌండ్ నాంపల్లి సెంట్రల్ ఎమర్జెన్సీ స్క్వాడ్ వద్ద ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
-ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. -మాస్కులు, శానిటైజర్ వాడటంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.
-ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు.