FILM NEWS: విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై "కల్తీ" మూవీ ప్రారంభం.
Vishwanadh Film Factory Started Kalthi Movie, Director Sri Krishna Paddam, Hero Druva, Latest Telugu Movies, Telugu World Now,
విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా నిర్మిస్తున్న నూతన చిత్రం " కల్తీ " ఇటీవల హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయం లో పూజ కార్యక్రమాలతో చిత్రం షూటింగ్ ప్రారంభ మయ్యింది .
ఈ సందర్భంగా*
దర్శకుడు శ్రీకృష్ణ పద్దం మాట్లాడుతూ.. .ధ్రువ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం .విజువల్ వండర్ గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి అన్నాడు
హీరో ధ్రువ మాట్లాడుతూ .. మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను , నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలు అన్నాడు .
నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ.. ఇది మా బ్యానర్ లో వస్తోన్న 2 వ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది. అక్టోబర్ మొదటి వారం లో ఈ సినిమా ప్రారంభించి హైదరాబాద్ , వైజాగ్ , ముంబై , చెన్నై లో చిత్రీకరిస్తాం అన్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు .
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ : ఆర్. కె . నాయుడు ,
ఎడిటర్ : కొండవీటి రవికుమార్ ,
సంగీతం : వెంకట్ ఐనాల ,
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్
దర్శకత్వ పర్యవేక్షణ : సూర్య ఆలంకొండ ,
కో- డైరెక్టర్ : కే . పి ,
అసోసియేట్ డైరెక్టర్స్ : కృష్ణ , జయంత్ , విష్ణు ,
నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు ,
దర్శకత్వం : శ్రీకృష్ణ పద్దం