For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Viral news వందే భారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..

12:26 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:26 PM May 13, 2024 IST
viral news వందే భారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం
Advertisement

Viral news భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది ప్రారంభించి వారం రోజులు కాకముందే ఈ ప్రమాదం జరగటం నిరాశ కలిగించినా వెంటనే మరమ్మత్తుల చేపట్టి గమ్య స్థానానికి చేర్చారు..

భారత ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్ల సిరీస్‌లో భాగంగా మూడో రైలును గాంధీ నగర్ - ముంబై సెంట్రల్ మధ్య సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే ప్రారంభించి వారం రోజులు కూడా కాకముందే ఈ రైలు ప్రమాదానికి గురైంది.. ఈ రైలు ముంబై సెంట్రల్‌ నుంచి గాంధీనగర్‌ వెళ్తుండగా ఈ రోజు ఉదయం 11.15గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.. అహ్మదాబాద్ సమీపంలో పట్టాలపైకి వచ్చిన గేదెలను ఢీకొట్టింది. దీంతో రైలు ముందు భాగం మొత్తం చాలావరకు ధ్వంసమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేనట్టు తెలుస్తుంది.. అయితే రైలును వెంటనే బాగు చేసి గమ్యస్థానానికి చేర్చామని రైల్వే అధికారులు తెలిపారు. ANI తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది..

Advertisement GKSC

అయితే గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించడం వందే భారత్ రైళ్ల ప్రత్యేకత. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఇలాంటివి 400 రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో ఢిల్లీ - వారణాసి మధ్య తొలి రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ..

Advertisement
Author Image