Viral News : పశ్చిమ బెంగాల్ లో వింత ఘటన... భార్యకి తమ్ముడితో వివాహం చేసిన భర్త !
Viral News : రాను రాను మానవ సంబంధాలు ఇలా మారిపోతున్నాయ్ ఏంటి అని ప్రస్తుతం అందరికీ అనిపిస్తుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, వాటి కోసం కట్టుకున్న వారినే కడతేర్చడం వంటి ఘటనలు రోజు చూస్తూనే ఉంటున్నాం. కానీ పశ్చిమ బెంగాల్ లో తాజాగా జరిగిన ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కట్టుకున్న భార్యని భర్తే తన తమ్ముడికి ఇచ్చి మరోసారి వివాహం చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల లోకి వెళ్తే...
భర్తకు తన తమ్ముడిపై ఉన్న ప్రేమతో భార్యను ఇచ్చి వివాహం చేశాడని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. వాళ్లిద్దరి మధ్య ఉన్న రహస్య సంబంధం చూసి తట్టుకోలేక ఊరి జనం సమక్షంలో తన తమ్ముడుకి భార్యతో వివాహం జరిపించినట్లు తెలుస్తుంది. కాగా వీరి ఇప్పటికే 22 ఏళ్ల కుమారుడు ఉండగా అతనికి కూడా వివాహం జరిగింది. ఈ వయసులో ఇటువంటి పని చేసిన ఆమెపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లా శాంతిపూర్‌కు చెందిన అమూల్య దేబ్‌నాథ్, బబ్లా ప్రాంతానికి చెందిన దీపాలికి 24 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి కూడా వివాహమైంది. వృత్తిరీత్యా అమూల్య దేబ్‌నాథ్ వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. దేబ్‌నాథ్ వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తుండటంతో ఇంట్లో ఉంటున్న అతని సోదరుడు వరసయ్యే కిశబ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. తమ్ముడితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని గ్రహించిన అమూల్య దేబ్‌నాథ్ వాళ్లిద్దరు ఏకంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వారి చీకటి బంధాన్ని గ్రామస్తుల సమక్షంలో బయటపెట్టాడు. కట్టుకున్న భార్య సోదరుడితో తప్పు చేయడంతో ఆమెతో ఇక కాపురం చేయడం తన వల్ల కాదని తేల్చిచెప్పాడు. గ్రామస్థుల సమక్షంలోనే తన సోదరుడు కిశబ్‌తో భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

