For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bhakthi మనిషి రూపంలో ఉన్న వినాయకుని ఎప్పుడైనా చూసారా..

12:19 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:19 PM May 13, 2024 IST
bhakthi మనిషి రూపంలో ఉన్న వినాయకుని ఎప్పుడైనా చూసారా
Advertisement

Bhakthi బొజ్జ గణపయ్య ఎప్పుడు గణనాథుని రూపంలోనే దర్శనం ఇస్తాడు. ఆయన తోండంతో భక్తుల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. తొండం పెద్ద పెద్ద చెవులు లేని గణపయ్యను ఊహించుకోనే లేము.. అలాంటిది తొండంలేని బొజ్జ గణపయ్యను ఎప్పుడైనా చూసారా.. మనిషి రూపంలో ఉన్న గణనాధుని దేవాలయం విశేషాలు చూద్దాం..

మనిషి రూపంలో ఉన్న గణేశుని దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తొండం లేని గణనాధుడుగా ఈ దేవాలయంలో వినాయకుడు ప్రసిద్ధి చెందాడు.. ఈ ఆలయం తిలతర్పణ పురి గ్రామంలో ముక్తీశ్వరా ఆలయ ప్రాంగణంలో ఉంది. దీన్నే ఆది వినాయక ఆలయం అని పిలుస్తారు. మానవ రూపంలో కనిపించే ఈ దేవుడిని ‘నర ముఖ’ గణపతిగా పిలుస్తారు.

Advertisement GKSC

పితృదోషాలతో బాధపడేవారు ఈ నరముఖ దేవాలయాన్ని దర్శిస్తే కచ్చితంగా దోషాలన్నీ తొలగిపోతయని నమ్మకం. సాక్షాత్తూ శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండ ప్రధానం చేసినా ముక్తి లభించకపోవడంతో శివుడిని ప్రార్ధించాడట.. అప్పుడు సాక్షాత్తు ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఈ దేవాలయం దగ్గర ఉండే కొలనులో స్నానం ఆచరించి దశరధునికి పితృతర్పణం వదలమని చెప్పాడంట. అందుకే పితృ దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరని చెప్తున్నారు.. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏకంగా మనిషి రూపంలో ఉన్న ఏకైక వినాయకుడి దేవాలయం ఇదే కావటం మరొక విశేషం.

Advertisement
Author Image