Women Committed suicide due to harassment by the management of Vijayawada Loyola College
Vijayawada News : ఉయ్యూరు పశువుల ఆస్పటల్ బజార్లో నివాసముంటున్న చైతన్య గుంజా లక్ష్మీ విజయవాడ లయోలా కాలేజీలో పనిచేస్తుంది. ఆమె భర్త చైతన్య అదే కాలేజీలో ఎలక్ట్రిషన్ గా గుంజా లక్ష్మి అడ్మినిస్ట్రేటివ్డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది.
లక్ష్మి గత కొంత కాలం క్రితం విద్యార్థుల దగ్గర తన అవసరాల నిమిత్తం కొంత డబ్బులు తీసుకుంది. ఈ విషయంలో ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్, అకౌంటెంట్ విజయలక్ష్మి, సింహాచలం తనను విద్యార్థుల ముందు అనేకమార్లు అవమానించటమే కాకుండా తనను నిత్యం ఇదే విషయంపై వేధిస్తున్నారని మనస్థాపం చెంది శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. యధావిధిగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి బయలుదేరుతుండగా ఇంట్లో కర్చీఫ్ మర్చిపోయాను అంటూ వెనక్కి వెళ్లిన లక్ష్మి ఇంట్లో ఉన్న హిట్ స్ప్రే సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఆమెకు వాంతులు అవుతుండగా భర్త మరియు ఇంటి యజమాని కలసి హాస్పిటల్ కు తరలించగా వైద్య సేవలు అందిస్తూ ఉండగానే లక్ష్మి మరణించింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లు పరిశీలించగా అందులో సూసైడ్ నోటు ఉండడాన్ని గమనించిన భర్త పోలీసులకు అందజేశారు.
ఆ సూసైడ్ నోట్లో తాను విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని అవి తిరిగి ఇస్తానని ఫాదర్ కిషోర్ కి చెప్పామని ఆయన కావాలని తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంది. తన చావుకి అకౌంటెంట్ విజయలక్ష్మి ,సింహాచలం మరియు డిగ్రీ ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్ కారణమని పేర్కొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉయ్యూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.