For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS : విడుదల-2 థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా, మీ అందరికి నచ్చుతుంది : హీరో విజయ్‌ సేతుపతి

11:33 PM Dec 15, 2024 IST | Sowmya
UpdateAt: 11:33 PM Dec 15, 2024 IST
film news   విడుదల 2 థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా  మీ అందరికి నచ్చుతుంది   హీరో విజయ్‌ సేతుపతి
Advertisement

Vidudala-2 : విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..  ప్రముఖ నిర్మాత , శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర  తెలుగు హక్కులను దక్కించుకున్నారు కాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌ల్లో భాగంగా హీరో విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌ మంజు వారియర్‌ ఆదివారం హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా హీరో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ... '' విడుదల-2 సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఇచ్చే సపోర్ట్‌ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇటీవల నా మహారాజా చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేశారు. ఆ కోవలోనే విడుదల-2 కూడా మిమ్ములను ఎంతగానో అలరిస్తుందనే నమ్మకం వుంది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్‌ అవుతుంది. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాలి. అందరిని ఎంతో సంతృప్తి పరిచే చిత్రమిది'' అన్నారు.

Advertisement

నిర్మాత రామారావు మాట్లాడుతూ... '' విడుదల-2 ప్రమోషన్స్‌  కోసం వచ్చిన నట దళపతి విజయ్‌సేతుపతి,  సహజ నటి మంజు వారియర్‌ కు నా ధన్యవాదాలు. భారతదేశంలోని హీరోలందరూ వెట్రీమారన్‌ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. అలాంటి దర్శకుడు, విజయ్‌ సేతుపతి కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో.. మిమ్ములను ఎలాంటి ప్రపంచంలోకి తీసుకవెళుతుందో డిసెంబరు 20న థియేటర్స్‌లో చూడబోతున్నారు. అందరూ ఇది తమిళ సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది తెలుగు నెటివిటికి దగ్గరగా వున్న సినిమా. మన తెలుగు నాట జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, తెలుగు నాట ఉన్న సమస్యలను బేస్‌ చేసుకుని వెట్రీమారన్‌ తీసిన సినిమా ఇది. ఈ చిత్రానికి ఇళయారాజా గారు ఆయన సంగీతంతో ప్రాణం పోశారు. పీటర్‌ హెయిన్‌ ఫైట్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటాయి. ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌పై చూడని పోరాట ఘట్టాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రం 257 రోజులు షూటింగ్‌ జరిగితే ఈ చిత్రం కోసం 127 రోజులు విజయ్‌ సేతుపతి షూట్‌ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

మంజు వారియర్‌ మాట్లాడుతూ... '' ఈ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొనటం హ్యపీగా ఉంది. ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనది. గతంలో అసురన్‌ సినిమాకు వెట్రీమారన్‌ దర్శకత్వంలో పనిచేశారు. ఆయనతో ఈ సినిమా కోసం మరోసారి వర్క్‌ చేయడం మెమెరబుల్‌.  తెలుగులో ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. 'విడుదల-2' లాంటి గొప్ప చిత్రంలో నేను ఒక పార్ట్‌ అవడం గర్వంగా ఉంది. విజయ్‌ సేతుపతి లాంటి గొప్ప ఆర్టిస్ట్‌తో పనిచేయడం ఎంతో లక్కీగా ఫీలవుతున్నాను. ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ ప్లస్‌. అందరూ తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాలి' అన్నారు.

Advertisement
Tags :
Author Image