For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Vijay Antony Poetic Action Film 'Toofan' Teaser Launched grandly

12:21 PM May 30, 2024 IST | Sowmya
Updated At - 12:24 PM May 30, 2024 IST
vijay antony poetic action film  toofan  teaser launched grandly
Advertisement

వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఆయన లవ్ గురు సినిమా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో తుఫాన్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ప్రస్తుతం తుఫాన్ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. జూన్ లో ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. తాజాగా "తుఫాన్" సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ... "తుఫాన్" యాక్షన్ ప్యాక్డ్ మూవీ. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చుతుంది. మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ సినిమాటోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేశారు. తెలుగులో వచ్చిన ప్రేమిస్తే చిత్రానికి ఆయనే సినిమాటోగ్రాఫర్. విజయ్ తో కలిసి పనిచేయడ హ్యాపీగా ఉంది. భాష్యశ్రీ నాతో కంటిన్యూగా ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా ఆయనకు కూడా మంచి పేరు తెస్తుంది. నిర్మాత వంశీ నందిపాటి నాతో బిచ్చగాడు 2 సినిమాకు అసోసియేట్ కాబోతున్నాడు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్.

Advertisement GKSC

సత్యరాజ్, శరత్ కుమార్, డాలీ ధనుంజయ వంటి చాలా మంది పేరున్న కాస్టింగ్ తో "తుఫాన్" మూవీ మీ ముందుకు రాబోతోంది. జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. నేను ఇటీవల రివ్యూయర్స్ గురించి మాట్లాడిన మాటలు అందరినీ ఉద్దేశించి కాదు. సినిమా మా బేబి. మీ బేబిని ఎవరైనా తిడితే మీకు కోపం వచ్చినట్లే మేము కష్టపడి చేసిన సినిమాను విమర్శిస్తే కోపం వస్తుంది. ఒకరిద్దరు బ్యాడ్ ఇంటెన్షన్ తో ఇచ్చిన రివ్యూల వల్ల మా సినిమా కిల్ అవుతుందని చెప్పాం. అది పర్సనల్ గా జరిగిన అటాక్. సినిమా గురించి రివ్యూ చెప్పే రైట్ మీడియాకు ఉంది. ఆ స్వేచ్ఛను గౌరవిస్తాను. తెలుగులో ఇటీవల థియేట్రికల్ గా కొన్ని మూవీస్ ఆదరణ పొందలేదు. కానీ హనుమాన్, టిల్లు స్క్వేర్ సినిమాలు మంచి బాక్సాఫీస్ వసూళ్లను సాధించాయి. కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు. అన్నారు.

Advertisement
Author Image