COVID NEWS: 30 వేల మందికి పైగా ఉచిత పౌష్టికాహార పంపిణీ జరిగిన సందర్భంగా "వేదం ఫౌండేషన్" లోగోను లాంచ్ చేసిన "విప్లవ్ కుమార్"
Vedam Foundation, Aravind Alishetty, Covid News, Free Food Distribution, TUFIDC Chairman Viplav Kumar, Telangana 2nd Lock Down, Telugu World Now,
COVID NEWS: 30 వేల మందికి పైగా ఉచిత పౌష్టికాహార పంపిణీ జరిగిన సందర్భంగా "వేదం ఫౌండేషన్" లోగోను లాంచ్ చేసిన "విప్లవ్ కుమార్"
గత 25 రోజులుగా వేదం ఫౌండేషన్ కరోనా బాధితులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని గాంధీ, నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు, వారితో ఉన్న అటెండర్స్ మరియు వైద్య సిబ్బందికి, RTC సిబ్బందికి కూడా ఉచిత పౌష్టికాహార పంపిణీ చేస్తుంది వేదం ఫౌండేషన్...
ఇప్పటి వరకు 30 వేల మందికి పైగా ఆహారాన్ని అందించడం జరిగింది. వేదం ఫౌండేషన్ చేస్తున్న కృషిని గుర్తించిన TUFIDC చైర్మన్ విప్లవ్ కుమార్ వేదం ఫౌండేషన్ 30000+ లోగో ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇలాంటి సేవలను వేదం ఫౌండేషన్ ఇలాగే కొనసాగించాలని విప్లవ్ కుమార్ కోరారు. వేదం ఫౌండేషన్ అధినేత అరవింద్ అలిశెట్టి గత 25 రోజులుగా 30 వేల మందికి ఉచిత పౌష్టికాహారాన్ని కరోనా బాధితులకు అందిస్తున్నారు.