Varun Tej : మరో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న వరుణ్ తేజ్ ...... పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ...
Varun Tej : యంగ్ హీరో వరుణ్ తేజ్ సినిమాల వేగం పెంచాడు. ‘గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడ వేగ’ లాంటి హిట్ చిత్రాలత సత్తా చాటిని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న ‘గాంఢీవదారి అర్జున’ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్న చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదేగాక ఇప్పటికే ఇంకొక పాన్ ఇండియా చిత్రాన్ని లైన్‌లో పెట్టిన వరుణ్.. తాజాగా మరో సినిమాకు సైన్ చేశారు. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సినిమా చేయడానికి సైన్ చేశారు.
ఇటీవలే మూవీ ప్రొడక్షన్‌లోకి ఎంటరైన వైరా ఎంటర్‌టైన్మెంట్స్.. మొదటి సినిమాగా నేచురల్ స్టార్ నానితో NANI30 చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక తమ రెండో సినిమాను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో నిర్మించడానికి సిద్ధమైంది. ఇందుకోసం తనకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం. అయితే ఇన్ని రోజులు సరైన స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసిన ప్రొడక్షన్ హౌస్‌కు తాజాగా ఒక స్క్రిప్ట్‌తో శాటిస్‌ఫై అయ్యిందట. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ తన స్క్రిప్ట్‌తో వరుణ్ తేజ్‌ను ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తుండగా.. మొత్తానికి ప్రాజెక్ట్ లాక్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
అయితే, వరుణ్ తేజ్ తన ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారట. ఈ లోపుగా కరుణ కుమార్ అండ్ టీమ్.. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ను ఫైనల్ చేసే పనిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుండగా.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరికీ ‘అంతరిక్షం’ సినిమా నుంచే పరిచయం ఉండగా.. చాలా ఏళ్లుగా తమ విషయాన్ని చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేశారు. మొత్తానికి ఎంగేజ్‌మెంట్ ద్వారా తమ రిలేషన్‌షిప్‌ను అఫిషియల్ చేశారు.