For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Clay Face Masks:ముల్తానీ మట్టే కాదు ఎన్నో రకాల క్లే మాస్క్‌లు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి ...

02:09 PM Jul 04, 2023 IST | Sowmya
Updated At - 02:09 PM Jul 04, 2023 IST
clay face masks ముల్తానీ మట్టే కాదు ఎన్నో రకాల క్లే మాస్క్‌లు ఉన్నాయి   అవేంటో ఇప్పుడే తెలుసుకోండి
Advertisement

Clay Face Masks: అమ్మయిలు బ్యూటీ కేర్‌లో క్లే మాస్క్‌లు కూడా వేసుకుంటూ ఉంటారు. క్లే మాస్క్‌లు చర్మంపై ఉండే అదనపు నూనెను తొలగిస్తుంది. చర్మంపై పేరుకున్న వ్యర్థాలను, మురికిని తొలగించి.. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు, మొటిమలతో బాధపడేవారు మట్టి మాస్క్‌లు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. క్లే మాస్క్‌లు యాక్నే, ముడతలు, గీతలను తొలగించడంతో పాటు ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. మనకు ఎక్కువగా ముల్తానీ మట్టి గురించే తెలుసు. చాలా మంది సౌందర్య సంరక్షణకు ముల్తానీ మట్టిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన అందాన్ని సంరక్షించుకోవడానికి.. ముల్తానీ మట్టే కాదు ఎన్నో రకాల క్లే మాస్క్‌లు ఉన్నాయి.అవి ,

ఆస్ట్రేలియన్‌ పింక్‌ క్లే..
ఆస్ట్రోలియన్‌ పింక్‌ క్లే లో సిలికా, మెగ్నీషియం, సెలెనియం, జింక్‌ వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం మంట, వాపును తగ్గిస్తాయి. దీనిలో మినరల్స్‌ చర్మం తేమను లాక్ చేసి, డిటాక్స్‌ చేస్తాయి. ఆస్ట్రేలియన్ పింక్ క్లే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌, వ్యర్థాలను తొలగించి.. ఫ్రేష్‌ లుక్‌ ఇస్తుంది. చర్మంలోని అదనపు నూనెను తొలగిస్తుంది. ఆస్ట్రేలియన్‌ పింక్‌ క్లే అన్ని చర్మతత్వాలవారికీ మంచిదే.

Advertisement GKSC

సీ క్లే..
దీన్ని ఫ్రెంచ్‌ గ్రీన్‌ క్లే అని కూడా పిలుస్తారు. మిలియన్ల సంవత్సరాల క్రితం సముద్రం క్రింద వేసిన పురాతన మట్టి నిక్షేపాల నుంచి దీనిని తవ్వుతారు. సీ క్లేలో సిలికా, ఐరన్, అల్యూమినియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలను, వాటి మచ్చలను తొలగిస్తుంది. ఇది ఉత్తమమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీన్ని మాస్క్‌లు, స్క్రబ్‌లు, క్లే బాత్‌లో వాడొచ్చు.

Advertisement
Author Image