Star anise : ఈ అనాస పువ్వు తలనొప్పి తగ్గించడం లో ప్రధానం గా పనిచేస్తుంది .. ఎలానో తెలుసుకోండి ..
Star anise : బిర్యానీ.. ఇది చాలా మంది ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. దీని సువాసనకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. బిర్యానీకి ఆ వాసన రావడానికి.. దానిలో వాడే మసాలాలే కారణం. వాటిలో అనాస పువ్వు కూడా ఒకటి. అనాసపువ్వు బిర్యానీకి మంచి వాసన ఇస్తుంది. దీన్ని బిర్యానీలోనే కాదు.. కూరలు, పిండి వంటలు తయారీలోనూ వాడుతుంటారు. ఇది వంటలకు మంచి వాసన ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
అనాస పువ్వులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ B1, B2, B3, B6, E ఉంటాయి. అనాసపువ్వు గింజల్లో.. సెలీనియం, జింక్, కాపర్ మెండుగా ఉంటాయి.
బ్రెయిన్ పవర్ పెంచుతుంది..
వయస్సు పెరిగే కొద్దీ మెదడు కార్యకలాపాలు, పనితీరు మందగిస్తాయి. ఆనాసపువ్వు బ్రెయిన్ బూస్టర్‌గా పనిచేస్తుంది. మెదడులోని అత్యంత చురుకైన ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. చైనీస్ వైద్యంలో, అనాస పువ్వును మెదడుకు టానిక్‌గా పరిగణిస్తారు. ఇది ఏకాగ్రత, దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. నాడీ వ్యవస్థను రక్షిస్తుంది.
ఆందోళన, డిప్రెషన్ తగ్గిస్తుంది..
అనాసపువ్వు డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇది యాంటిడిప్రెసెంట్స్ కంటే మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో సమృద్ధిగా ఉండే.. విటమిన్ బి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అనాస పువ్వు తాగితే.. ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.