For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bananas: రోజంతా యాక్టివ్ గా వుండాలి అంటే ఇవి తప్పనిసరిగా తినాల్సిందే .....

04:17 PM Jun 29, 2023 IST | Sowmya
Updated At - 04:17 PM Jun 29, 2023 IST
bananas   రోజంతా యాక్టివ్ గా వుండాలి అంటే  ఇవి తప్పనిసరిగా తినాల్సిందే
Advertisement

Health care Tips: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండటం చాలా ముఖ్యం. శరీరంలో ఏ మాత్రం శక్తి తగ్గినా.. నీరసం, నిస్సత్తువ, అలసత్వం ఆవహిస్తాయి. దీంతో, మనం పూర్తి చేయాల్సిన పనులు అలస్యం అవుతాయి, లేకపోతే పెండింగ్‌ పడిపోతాయ్. మనం అనుకున్నది సాధించాలన్నా, పనులు పెండింగ్‌ లేకుండా పూర్తి కావాలన్న యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.

మన శరీరంలో శక్తి స్థాయిలను స్థిరంగా నిర్వహించడానికి.. తగిన మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్స్‌, మినరల్స్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కార్బోహైడ్రేట్లు శరీరానికి గ్లూకోజ్‌ను అందిస్తాయి, ఇది శక్తికి అవసరమైన ప్రాథమిక వనరు. శక్తి జీవక్రియకు ఐరన్‌, మెగ్నీషియం, విటమిన్‌ బి, సి వంటి పోషకాలు చాలా ముఖ్యం. మన శరీరంలో శక్తి స్థాయిలు పడిపోకుండా.. రోజుంతా ఉత్సాహంగా, హుషారుగా పనిచేయాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా మనకు వివరించారు.

Advertisement GKSC

అరటిపండ్లు..
అరటిపండు మనకు అన్ని సీజన్లలో లభిస్తుంది. దీనిలో విటమిన్‌ B6 మెండుగా ఉంటుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. విటమిన్‌ B6 మీ శరీరం కార్బోహైడ్రేట్లను జీవక్రియ చేయడానికి తోడ్పడుతుంది. ఇది శక్తి ఉత్పత్తికి ఇంధనం ఇస్తుంది. అరటిపండ్లలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. ఇది శక్తి ఉత్పత్తికి తోడ్పడుతుంది.

క్వినోవా..
క్వినోవా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ ఆహారం. ఇందులో మంచి మొత్తంలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరం ద్వారా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి శక్తిని నెమ్మదిగా, స్థిరంగా విడుదల చేస్తాయి.

Advertisement
Author Image