Soap Nuts: కుంకుడు కాయలతో తల స్నానం ఆరోగ్యానికి ,జుట్టుకు ఎంతో లాభం .. ఎలానో తెలుసుకోండి .
Soap Nuts: మన తాతయ్యలు, అమ్మమ్మలు చక్కగా కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. చిన్నతనంలో మనకూ కుంకుడు కాయలతోనే తలస్నానం చేయించేవారు. కానీ ఉరుకుల పరుగుల జీవితం, మార్కెట్లోకి షాంపూల రాక కారణంగా.. కుంకుడు కాయల వాడకం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం అందరూ షాంపూతోనే తలస్నానం చేస్తున్నారు. అయితే కుంకుడ కాయ తల, జుట్టు శుభ్రం చేయడమే కాదు జుట్టుకు పోషణ అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కుంకుడు కాయతో తలస్నానం చేస్తే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూసేదాం .
కుంకుడు కాయలలో న్యాచురల్ సపోనిన్‌లు ఉంటాయి. ఇవి న్యాచురల్ క్లెన్సర్స్. ఇవి తల, జుట్టులోని నూనెలను తొలగించకుండా జుట్టును సున్నితంగా శభ్రపరుస్తాయి. కుంకుడు కాయలు సున్నితమైన జుట్టు, డ్రైహెయిర్ ఇలా ఎలాంటి జుట్టు ఉన్నా పర్షెక్ట్‌గా సరిపోతాయి.షాంపూలలో ఉండే సల్ఫేట్‌లు, పారాబెన్‌లు, సిలికాన్‌ల వంటి కఠినమైన రసాయనాలు కుంకుడు కాయలలో ఉండవు. కుంకుడు కాయలలో హానికరమైన పదార్థాలు ఉండవు. ఇవి తలస్నానానికి బెస్ట్ ఆప్షన్.
కుంకుడు కాయలలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చుండ్రు, దురద, స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షిస్తాయి. ఇవి మీ తలను ఆరోగ్యాంగా ఉంచుతాయి. శుభ్రమైన, ఆరోగ్యకరమైన తల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టును దృఢంగా ఉంచుతాయి..
కుంకుడు కాయలలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, డి ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించి దృఢంగా మారుస్తాయి. జుట్టు చిట్లడం, చివర్లు చీలిపోవడాన్ని నివారిస్తాయి. మీరు తరచు కుంకుడు కాయతో తలస్నానం చేస్తే.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
మెరుపు అందిస్తుంది..
మీ జుట్టు నిస్తేజంగా, నిర్జీవంగా మారిందా. అయితే, కుంకుడు కాయలు సహాయపడతాయి. కుంకుడు కాయతో తలస్నానం చేస్తే.. మీ జుట్టుకు మెరుపునందిస్తాయి. ఇది జుట్టులోని సహజ నూనెలను తొలగించదు. మీ జుట్టు మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచుతుంది.