For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Hibiscus : మందరాన్ని ఇలా వాడితే వత్తు అయిన జుట్టు మీ సొంతం ... అధి ఎలానో తెలుసుకోండి...

10:30 AM May 28, 2023 IST | Sowmya
Updated At - 10:30 AM May 28, 2023 IST
hibiscus   మందరాన్ని ఇలా వాడితే వత్తు అయిన జుట్టు మీ సొంతం     అధి ఎలానో తెలుసుకోండి
Advertisement

Hibiscus:ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పూలలో మందారం ఒకటి.దాదాపు అందరి ఇంట్లో మందార చెట్లు ఉంటాయి. మందారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మందారంలోని పోషకాలు జుట్టు సంరక్షణలో సహాయపడతాయని నిపుణులు చెబుుతున్నారు. మందారంలో ఫ్లేవనాయిడ్స్‌, అమినో యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచడానికి, హెయిర్‌ ఫోలికల్స్‌ను ప్రేరేపించడానికి తోడ్పడతాయి. జుట్టుకు సహజమైన షైన్‌, ఆకృతిని అందిస్తుంది. దీనిలో అద్భుతమైన శీతలీకరణ లక్షణాలు శిరోజాలను రిలాక్స్‌ చేస్తాయి. మందారంలోని జిగురు పదార్థం పొడి స్కాల్ప్‌కు మెడిసిన్‌లా పని చేస్తుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ జుట్టు రాలే సమస్యను పరిష్కరిస్తాయి.

మీకు జుట్టు అధికంగా రాలుతుంటే .. ఈ సమస్యను పరిష్కరించడానికి మందారం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ సమస్యకు చెక్క్‌ పెట్టడానికి మందార పూలను ముద్దగా చేసి అందులో రెండు లేదా మూడు చుక్కల బాదం నూనె, 2 చెంచాల ఉసిరి పొడి వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు అప్లై చేసి.. షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. ఇలా రెండు గంటల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత  షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

Advertisement GKSC

జుట్టు పెరగాలంటే..
జుట్టు దృఢంగా పెరగాలంటే.. ఆరేడు మందారపూలను, పదిహేను మందార ఆకులను తీసుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె గోరువెచ్చగా వేడిచేయాలి. అది చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ను బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని జట్టుకు పట్టించి.. గంట పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. జుట్టు కదుళ్లు స్ట్రాంగ్‌ అవుతాయి. జుట్టు పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది.

Advertisement
Author Image