Health ఆరోగ్యం కోసం వంటల్లో ఈ నూనెలలో ఓసారి ట్రై చేయండి..
Health సాధారణంగా వంట గదిలో ఉండే అత్యవసర వస్తువుల్లో నూనె కూడా ఒకటి ఈ కాలంలో చాలా నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఆరోగ్యం, రుచి కోసం ఉపయోగపడే కొన్నిటిని గురించి తెలుసుకుందాం..
మనదేశంలో ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిని వంటల్లో వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అయితే చాలామందికి ఈ కొబ్బరినూనె బ్యూటీ కోసం జుట్టు కోసం అని మాత్రమే తెలుసు కానీ దీనిలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ నూనె జీవక్రియ రేటుని పెంచుతుందని, ఆకలిని అణిచివేస్తుందని చెబుతారు. అయితే అలవాటు లేని వాళ్ళు కొబ్బరినూనె తినటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు దీనిలో రెండు రకాలు ఉంటాయి శుద్ధిచేయని కొబ్బరినూనె ఘాటుగా ఉన్నప్పటికీ శుద్ధి చేసిన కొబ్బరి నూనె వంటల్లో వాడటం వల్ల రుచితో పాటు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి..
ఏళ్ల నుంచి భారతి వంటకాల్లో భాగంగా మారింది నువ్వుల నూనె బాగా వేయించి దాన్నుంచి నూనె తీసి ఆ నూనెను వంటల్లో ఉపయోగిస్తారు ఈ నూనె రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.. నువ్వుల నూనెల విటమిన్ ఇ, బి6, మెగ్నీషియం, కాల్షియం, కాపర్, ఐరన్ అధిక స్థాయిలో ఉంటాయి.. ఈ నూనె అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్‌కి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ సైతం వాళ్లకు కూడా ఈ నూనెతో చేసిన ఆహారం పెట్టడం చాలా మంచిది..
