Masturbation : హస్త ప్రయోగం చేసుకుంటున్నారా? ఈ విస్తుగొలిపే నిజాలు మీ కోసమే..
Unknown Facts About Masturbation : సృష్టిలో జీవి అన్నాక శృంగార కోరికలు కలగడం సర్వసాధారణం. భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరు తమ శృంగార కోరికలను క్రమం తప్పకుండా తీర్చుకుంటూ ఉంటారు. మరి సింగిల్ గా ఉన్న వారి పరిస్థితి ఏంటి? వారికి కోరికలు పుడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లోనే చాలామంది హస్తప్రయోగం వైపు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది వారి లైంగిక కోరికలను తీర్చుకోవడానికి హస్తప్రయోగాన్ని అనుసరిస్తున్నారు. వైద్య పరంగా ఈ ప్రక్రియ సర్వసాధారణమైనప్పటికీ సామాజికపరంగా చాలా చెడ్డదని కొందరు చూస్తూ ఉంటారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హస్తప్రయోగానికి సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. దీని కారణంగా ప్రజల్లో హస్తప్రయోగంపై అనేక అపోహలు ఏర్పడ్డాయి. చాలామంది యుక్త వయసులో ఉన్నప్పుడే ఎక్కువగా ఈ హస్తప్రయోగానికి అలవాటు పడుతూ ఉంటారు. కానీ దీనిని ప్రతిరోజు చేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే కాకుండా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది అని అనేక అపోహాలతో కొందరి సతమతమవుతున్నారు. అయితే ఇలా వస్తున్న అపోహాలను దృష్టిలో పెట్టుకొని 2011లో ‘ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్’ ప్రత్యేక అధ్యయనాలను చేసింది. ఈ అధ్యయనాల్లో భాగంగా వస్తున్న అపోహాలన్నింటినీ అవస్తమని తేల్చి చెప్పింది.
క్రమం తప్పకుండా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనంలో పేర్కొన్నారు. ముఖ్యంగా దీనివల్ల హార్మోన్ల సమతుల్యం, ఒత్తిడి తగ్గడం వంటి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనం తేల్చి చెప్పింది. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల అనేక రకాల అనేక రకాల లాభాలు కలుగుతాయని తెలిపింది.