Friday Movie : ఉగాది శుభాకాంక్షలతో డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'ఫ్రై డే' పోస్టర్
Tollywood Latest Updates : దీయరాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా "ఫ్రై డే". ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఈశ్వర్ బాబు ధూళి పూడి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
త్వరలోనే "ఫ్రై డే" సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు ఉగాది పండుగే కాకుండా నిర్మాత శ్రీనివాస్ పెళ్లిరోజు కావడంతో చిత్ర యూనిట్ నిర్మాతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు . అలాగే"ఫ్రై డే" సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ : "ఫ్రై డే" మూవీ టీమ్ నుంచి ప్రేక్షకులకు ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ కథతో "ఫ్రై డే" చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకునేలా మా దర్శకుడు ఈశ్వర్ బాబు.ధూళిపూడి సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే "ఫ్రై డే" చిత్రాన్ని గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. మీ అందరి సపోర్ట్ మా సినిమాకు ఉండాలని కోరుకుంటున్నాం. అన్నారు.
Cast : Deeyaraj, Rihana, Inaya Sultana, Snigdha Nayani, Naveen, Vikas Vasishta, Rohit boddapati,Balagam Sanjay, Suman, Pragathi, Koteshmanav, Shubodayam Rajasekhar, Prabhu, Jym Carrey Mahesh, RK Naidu
టెక్నికల్ టీమ్ :
బ్యానర్ - శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్
డైరెక్టర్ - ఈశ్వర్ బాబు ధూళి పూడి
స్టోరీ, డైలాగ్స్ - రాజ్ మరియన్
ప్రొడ్యూసర్ - కేసనకుర్తి శ్రీనివాస్
మ్యూజిక్ - ప్రజ్వల్ క్రిష్
లిరిక్స్ - మధు కిరణ్.ఎం
ఎడిటర్ - ప్రవీణ్ టమ్ టమ్
సినిమాటోగ్రఫీ - పృథ్వీ
పీఆర్ఓ - బి.వీరబాబు