Crime రెప్పపాటు లోనే ఓ వ్యక్తి అజాగ్రత్తకు బలైపోయిన రెండు నిండు ప్రాణాలు.. వీడియో షేర్ చేసిన ఐపీఎస్ అధికారి..
Crime కొన్నిసార్లు కళ్ళముందే తిను ప్రమాదాలు జరగబోతూ ఉంటాయి. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదాలను ఆపటం ఎవరితరం కాదు.. ముఖ్యంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అజాగ్రత్తలే ప్రాణాలు మీదకు తీసుకువస్తాయి ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు చేసిన వారిదే కాకుండా ఎదుటివారు కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది తాజాగా ఓ వ్యక్తి ఆ జాగ్రత్త వల్ల రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి ప్రస్తుతం ఈ వీడియో అందరినీ కలిచివేస్తుంది..
ప్రతినిత్యం ఎన్నో ఆక్సిడెంట్లు జరుగుతూనే ఉంటున్నాయి ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం కనురెప్ప పాటలోనే ప్రాణాలు పోతున్నాయి.. తాజాగా ఓ మనిషి అజాగ్రత్త వలన రెండు నిండు ప్రాణాలు ఎలా బలైపోయాయో ఐపీఎస్ అధికారి, బెంగళూరు తూర్పు డీసీపీ కళా కృష్ణస్వామి ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఓ వ్యక్తి కారు నుంచి బయటకు దిగేందుకు డోర్ ను ఓపెన్ చేస్తూ వెనక వస్తున్న ద్విచక్ర వాహనంపై ఇద్దరిని గమనించలేదు దీంతో డోర్నొక్కసారిగా రేష్గా ఓపెన్ చేయడంతో పక్కగా వస్తున్న లారీ మీదకు వీరిద్దరూ పడిపోయారు అంతే చూస్తుండగానే లారీ వాళ్ళిద్దరి మీద నుంచి ముందుకు వెళ్లిపోయింది రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన చూసినవాళ్లంతా నిర్గాంత పోతున్నారు ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా అంటూ తమ సంతాపం తెలియజేస్తున్నారు.. షేర్ చేసిన ఐపీఎస్ అధికారి దయచేసి మీరు మీ వాహనం తలుపులు తెరిచేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి.. అంటూ టాగ్ చేశారు..
https://twitter.com/DCPTrEastBCP/status/1575016875121332236?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1575016875121332236%7Ctwgr%5Ed7daa9481efe7a4d5282728f9f6272eaa4c776df%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fbikers-colliding-into-a-moving-truck-shows-why-one-should-carefully-open-car-door-watch-shocking-video-au60-796781.html