For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం

03:37 PM May 04, 2024 IST | Sowmya
Updated At - 03:37 PM May 04, 2024 IST
tollywood news   ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం
Advertisement

"డైరెక్టర్స్ డే" సందర్భంగా ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ శనివారం నాడు "ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్" సమర్పణలో రెండు సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణంలో "ఖుషి టాకీస్" బ్యానర్ లో సీత ప్రయాణం కృష్ణతో..అనే చిత్రం, "మహీ మీడియా వర్క్స్" బ్యానర్ పై "త్రిగుణి" చిత్రం లాంఛనంగా ముహూర్తం షాట్ తో మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ముహూర్తం షాట్స్ కి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రసిద్ధ దర్శకులు దాసరి మారుతి తొలి క్లాప్ కొట్టారు.

ఆ తర్వాత జరిగిన సభలో ఈ రెండు చిత్రాల తొలి పోస్టర్లను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్నకుమార్, డార్లింగ్ స్వామి, రుద్రాపట్ల వేణుగోపాల్, రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు.

Advertisement GKSC

ఆధ్యాంతం కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో నడిచే ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రానున్న "సీత ప్రయాణం కృష్ణ"తో అనే సినిమాలో నాయికా నాయకులుగా.. రోజా ఖుషి, దినేష్ నటిస్తున్నారు. వీరితో పాటు అనుపమ, సుమంత్, వైభవ్ తదితరులు నటిస్తున్నా రని ఈ చిత్ర దర్శకుడు దేవేందర్ చెప్పారు. త్రిగుణి సినిమాలో హీరోగా కుషాల్, ఒక ప్రత్యేక పాత్రలో రోజా ఖుషి నటిస్తుండగా తక్కిన పాత్రలకు అందరూ కొత్త నటీనటులనే పరిచయం చేస్తున్నామని ఆ చిత్ర దర్శకుడు వైతహవ్య వడ్లమాని చెప్పారు.

చిత్రం : సీత ప్రయాణం కృష్ణతో
బ్యానర్: ఖుషి టాకీస్
నటీనటులు: రోజా ఖుషి, దినేష్, సుమంత్, అనుపమ
సినిమాటోగ్రఫీ:రవీంద్ర
సంగీతం: హనుమాన్ త్సవటపల్లి
కో డైరెక్టర్: రాజేంద్ర
పోస్ట్ ప్రొడక్షన్: ఖుషి స్టూడియోస్
పీర్ఓ: హరీష్, దినేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెర్రీ
ప్రొడక్షన్ కంట్రోలర్: రుద్రపట్ల వేణుగోపాల్
చీఫ్ అడ్వైజర్: రామ్ రావిపల్లి
సమర్పణ: ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ డా. రాజీవ్
నిర్మాత: రోజా భారతి
డైరెక్టర్ : దేవేందర్

చిత్రం : త్రిగుణి
బ్యానర్: మహి మీడియా వర్క్స్
నటీనటులు: రోజా ఖుషి, కుషాల్ తదితరులు
సినిమాటోగ్రఫీ:సలీం
సంగీతం: హనుమాన్ త్సవటపల్లి
కో డైరెక్టర్: రవి ఖుష్
పోస్ట్ ప్రొడక్షన్: ఖుషి స్టూడియోస్
పీర్ఓ: హరీష్, దినేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెర్రీ
ప్రొడక్షన్ కంట్రోలర్: రుద్రపట్ల వేణుగోపాల్
చీఫ్ అడ్వైజర్: రామ్ రావిపల్లి
సమర్పణ: ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ డా. రాజీవ్
నిర్మాత: మహేశ్వరి
కథ: వంశీ
డైరెక్టర్ : వైతహవ్య వడ్లమాని

Advertisement
Author Image