టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ తీసుకురాబోతున్న కొత్త టీవీ ఛానెల్, ప్రత్రిక పేరు ఏంటి ?
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సంచలన నిర్ణయం.
టీవీ9తో జర్నలిజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన లెజెండ్ రవి ప్రకాశ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త టీవీ ఛానల్‌తో పాటు, పత్రికను కూడా తీసుకురాబోతున్నారు. ఇందు కోసం రవిప్రకాశ్ ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశారు. జర్నలిజంలో లెజెండ్‌గా ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోయే రవి ప్రకాశ్ మరి కొన్ని రోజుల్లోనే కొత్త టీవీ ఛానెల్, పత్రికకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేసే వీలుంది. రవి ప్రకాశ్ తీసుకురాబోతున్న కొత్త టీవీ ఛానెల్, ప్రత్రిక ఎవ్వరూ ఊహించని విధంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నట్టు సమాచారం. టీవీ9 నుంచి బయటకు వచ్చిన తర్వాత మైహోం గ్రూప్ రవి ప్రకాశ్ పైన అనేక కేసులు పెట్టింది. ఆ కేసులన్నింటిలో ఇప్పటికే రవి ప్రకాశ్ పై చేయి సాధించారు. NCLT త్వరలో చెప్పబోయే తీర్పు కూడా రవి ప్రకాశ్‌కు అనుకూలంగా ఉంటుందనే సమాచారం ఉంది. అదే జరిగితే టీవీ9 మళ్లీ రవి ప్రకాశ్ చేతికి రాబోతుందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రవి ప్రకాశ్ కొత్తగా లాంచ్ చేయబోయే ఛానల్ ఏంటి? పత్రిక ఏంటి? అవి ఎలా ఉండబోతున్నాయని అనే ఉత్కంఠ మొదలైంది. మీడియా చరిత్రలో రవి ప్రకాశ్ మరో ప్రభంజనం సృష్టించబోతున్నాడా ? ఇది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే !