For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tulasi Uses : తులసి ఆకులతో చర్మ సమస్యలు దూరం .. అధి ఎలా వాడాలో తెలుసుకోండి ....

03:43 PM May 25, 2023 IST | Sowmya
Updated At - 03:43 PM May 25, 2023 IST
tulasi uses   తులసి ఆకులతో చర్మ సమస్యలు దూరం    అధి ఎలా వాడాలో తెలుసుకోండి
Advertisement

Tulasi uses : ఇప్పటిలో మొటిమలు అనేవి చాలా మందికి కామన్ ప్రాబ్లమ్ గా మారాయి అయితే దీని వల్ల మచ్చలు కూడా ఏర్పడి ముఖం అందవిహీనంగా మారుతుంది. మరి వీటిని దూరం చేయాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ  ఏం చేంజ్ ఉండదు కానీ స్కిన్ కోసం  కొన్ని టిప్స్ తప్పక  పాటించాలి.
మచ్చ రహిత చర్మం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అందుకోసం పార్లర్స్, ట్రీట్‌మెంట్స్ అంటూ పెద్దగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఉండే తులసిని కొన్ని ఇంటి చిట్కాలతో కలిపి ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు.తులసి తో కొన్ని టిప్స్ పాటిస్తే కొన్ని చర్మ సమస్యలు దూరం చేసుకోవచ్చు.

తులసి..

Advertisement GKSC

తులసి ఆకు  ప్రతి ఇంట్లోనూ ఉండనే ఉంటుంది. ఈ ఆకుల్లో గొప్ప గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ ఆకుల్ని ఆయుర్వేదంలో వాడతారు. దీనిని వాడి ఎన్నో వ్యాధుల్ని దూరం చేస్తారు. ఆరోగ్య సంరక్షణతో పాటు చర్మ సంరక్షణకి కూడా తులసి బాగా ఉపయోగపడుతుంది. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మొటిమలని దూరం చేస్తుంది. అదే విధంగా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల వల్ల వచ్చే నొప్పి, చీము, ఉపశమనాన్ని దూరం చేస్తాయి. తులసిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మొటిమలు, ఎండ నుంచి వచ్చే సమస్యల్ని దూరం చేస్తాయి.

అలోవేరాతో..

తులసి ఆకుల్ని పేస్టులా చేసి అందులో అలోవేరా జెల్ కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత దీనిని చన్నీటితో కడిగేయాలి.
అలా చేస్తే మొహం లో గ్లో వెంటనే చూడవచ్చు. కొన్ని రోజుల్లో కచ్చితం గా మోటాలు దూరం అవుతాయి .

Advertisement
Author Image