For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sports News : టోర్నమెంట్లు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి : సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

02:58 PM Apr 20, 2024 IST | Sowmya
Updated At - 02:58 PM Apr 20, 2024 IST
sports news   టోర్నమెంట్లు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి   సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
Advertisement
గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్న సీపీ శ్రీనివాస్‌రెడ్డి. 
ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ సిబి రాజు మెమోరియల్‌ ట్రోఫీ పేరుతో ఏర్పాటు చేసిన మెన్స్‌ అండ్‌ ఉమెన్స్ టెన్నిస్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన మహిళా క్రీడాకారులకు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ తో కలిసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయిలో ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ లో టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులకు ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తనకు క్రీడలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమానిని. నేను చూసే అతికొద్ది సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలే ఎక్కువ. అదేవిధంగా ప్రొడ్యూసర్ మరియు క్లబ్ అధ్యక్షుడు ఆది శేషగిరిరావు గారిని వారు చేస్తున్న కార్యక్రమాల్ని కూడా ఫాలో అవుతూ ఉంటాను అన్నారు.
ఈ టోర్నమెంట్‌ లో సింగిల్స్‌ విభాగంలో ఆకాంక్ష విన్నర్‌ గా నిలవగా అభయ వేమూరి రన్నర్‌గా గెలుపొందారు. డబుల్స్‌ ఫైనల్స్‌ లో మొదటి స్థానం లో ఆకాంక్ష, యుబరాణి బెనర్జీ నిలవగా రెండో స్థానంలో మేధావి సింగ్, ఆయుషా సింగ్‌ గెలుపొందారు. ప్రొడ్యూసర్ మరియు FNCC సెక్రటరి ముళ్ళపుడి మోహన్, స్పోర్ట్స్‌ కమిటీ చైర్మన్‌ చాముండేశ్వరినాథ్, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, జాయింట్ సెక్రెటరీ బి. రాజశేఖర్ రెడ్డి, ట్రెజరర్ ఏడిద రాజా, సువెన్‌లైఫ్, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు జాస్తి వెంకట్, కృష్ణంరాజు, కాజా సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కే.ఎస్‌రామారావు, బాలరాజు మరియు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Author Image