Film News : విక్రమ్ సహిదేవ్ లగడపాటి, ఎస్తేర్ అనిల్ ప్రొడక్షన్ నెం.2 గ్రాండ్ గా లాంచ్
స్టార్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్స్ తీయడంలో దిట్ట, తన గత చిత్రం 'ధమాకా'తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందించిన ఆయన తన బ్యానర్ నక్కిన నేరేటివ్స్‌లో ప్రొడక్షన్ నెం 2ను అనౌన్స్ చేశారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా నటిస్తుండగా, వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత.
బ్లాక్‌బస్టర్ సినిమా చూపిస్తా మావ తర్వాత త్రినాధరావు నక్కిన మరో అద్భుతమైన కథను రాశారు. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా కూడా తన సత్తాను నిరూపించుకోకున్నారు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా లాంచింగ్ వేడుకను జరుపుకుంది. త్రినాథరావు,నాయుడు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం షాట్ కు సందీప్ కిషన్ క్లాప్ కొట్టగా, శరత్ మరార్ కెమెరా స్విచాన్ చేశారు. సుమంత్ తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.
సూపర్ హిట్ ఫ్రాంచైజీ దృశ్యం చిత్రంలో వెంకటేష్ కుమార్తెగా కనిపించిన ఎస్తేర్ అనిల్, విక్రమ్ సహిదేవ్ లగడపాటి సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉండబోతున్న ఈ చిత్రానికి ఈగిల్ ఫేమ్ దావ్‌జాంద్ సంగీతం అందిస్తుండగా, మాయ వి. సినిమాటోగ్రఫర్. ప్రవీణ్ పూడి ఎడిటర్, రఘు కులకర్ణి ప్రొడక్షన్ డిజైనర్. నరేష్ తుల, రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ రాయగా, త్రినాధ రావు నక్కిన, నరేష్ తుల, ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.