Health : క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఆహార పదార్థాలు ఇవే..
Health అప్పట్లో ఎక్కడో ఒక దగ్గర క్యాన్సర్ అనే మాట వినే వాళ్ళం కానీ ఈ రోజుల్లో చాలా సాధారణంగా ఈ వ్యాధి ప్రబలుతుంది అయితే మారిపోతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు సరైన వాతావరణం లేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఈ వ్యాధికి మూలాలు అయితే దీనిని పూర్తిగా నివారించలేకపోయినా రాకుండా ఉండేందుకు మాత్రం కొన్ని ఆహార పదార్థాలు సహకరిస్తాయి అయితే అవి ఏంటి అన్న విషయం తెలుసుకుందాం..
క్యాన్సర్ ను నివారించటం అంత సాధ్యమైన పని కాదు.. అయితే ముందు జాగ్రత్తతో దీనిని అదుపులో ఉంచడం మాత్రం సాధ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇందుకోసం ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా ప్రతిరోజు ఆహారంలో భాగంగా గ్రీన్ టీ ను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుస్తుంది.. అలాగే నారింజలో కూడా ఏంటి ఆక్సిడెంట్ సి విటమిన్ ఎక్కువగా ఉంటాయి ఇవి కూడా యాంటీ ఏజింగ్ విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా బరువును తగ్గించడంలో సైనస్ వంటి వ్యాధుల్లో నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.. అలాగే ఇవి క్యాన్సర్ సంబంధిత కారకాలను అడ్డుకోవడంలో ముందుంటుందని తెలుస్తోంది..
అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండే బ్రోకోలీని కూడా ఆహారంలో భాగం చేసుకోవడంతో ఈ వ్యాధి నుండి దూరంగా ఉండవచ్చు అని తెలుస్తోంది.. అలాగే వెల్లుల్లి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నుండి దూరంగా ఉండవచ్చు.. అలాగే పసుపును కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు..
