For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

BHATHI NEWS: దేవాలయంలో దైవానికి ఎలా నమస్కరించాలి ?

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
bhathi news  దేవాలయంలో దైవానికి ఎలా నమస్కరించాలి
Advertisement

The Science Behind Namaskar, How to Namaskar To God in Temples Devoties, What is The Correct Method Namaskar to God, Bhakthi News, Telugu World Now,

BHATHI NEWS: దేవాలయంలో దైవానికి ఎలా నమస్కరించాలి ?

Advertisement GKSC

సాధారణంగా నిత్యం దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునేవారి సంఖ్య తక్కువగానే వుంటుంది. అప్పుడప్పుడూ, పండగలూ, పర్వదినాల్లో దేవాలయాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువే వుంటుంది. అయితే, పూజలూ, పునస్కారాలూ, దీపారాధన చేయాల్సిన విధానం, తీర్థం స్వీకరించాక తలను జుట్టుకు రాసుకోవచ్చా, రాసుకోకూడదా... ఇలాంటి సందేహాలు ఎంతోమందిలో వుంటాయి. అన్నింటికీ మించి దేవాలయానికి వెళ్లామా, దైవ దర్శనం చేసుకుని వచ్చామా అన్నట్టుగా గాక, దైవానికి ఎలా నమస్కరించాలి అనే సందేహం చాలామందిలో వుంటుంది. మరి, ఎలా నమస్కరించాలో తెలుసుకుందాం...!!

దైవానికి నమస్కరించే సమయంలో భక్తులు స్వామివారికి ఎదురుగా నుంచుని ఆయన దర్శనం చేసుకుంటూ వుంటారు. అలా కాకుండా భక్తులు ఒక వైపున పక్కకి నిలబడాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చక స్వామి వుండి పూజాభిషేకాలు నిర్వహించి హారతి ఇస్తారు. ఈ తతంగాన్నంతా స్పష్టంగా తిలకించి తరించాలంటే భక్తులు గర్భాలయం వెలుపల స్వామివారికి ఎడమ పక్కన నిలబడాలి. ఇక పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించమో, అలాగే భగవంతుడికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఒక పక్కకి నిలబడే నమస్కరించాలి. ప్రధాన దైవానికి ఎదురుగా హనుమంతుడు, గరుత్మంతుడు, నంది మొదలైన ప్రతిమలు వుంటాయి. వాటికీ, స్వామికీ మధ్యలో నిలబడకూడదని పెద్దలు చెబుతూంటారు.

The Science Behind Namaskar, How to Namaskar god in temples,what is the correct method namaskar to god,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com,

Advertisement
Author Image