For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రాజా సాబ్, హరి హర వీరమల్లు తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా : హీరోయిన్ నిధి అగర్వాల్

12:00 PM Dec 04, 2024 IST | Sowmya
Updated At - 12:00 PM Dec 04, 2024 IST
రాజా సాబ్  హరి హర వీరమల్లు తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా   హీరోయిన్ నిధి అగర్వాల్
Advertisement

రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తోంది బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె ఆస్క్ నిధి పేరుతో ఛాట్ చేసింది. పర్సనల్, కెరీర్ విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్ కు ప్రశ్నలు పంపించేందుకు ఆసక్తి చూపించారు.

ప్రభాస్ తో కలిసి నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్ లో ఎంతో సరదాగా పనిచేశామని, ఈ మూవీ టీమ్ లో ఎంతో డెడికేషన్ ఉందని నిధి అగర్వాల్ తెలిపింది. పవన్ కల్యాణ్ తో రీసెంట్ గాా ఓ సెల్ఫీ తీసుకున్నానని, త్వరలోనే ఆ సెల్ఫీ పోస్ట్ చేస్తానని నిధి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తనకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చు అని, కేవలం అందరికీ నమస్కారం అనే బ్యాచ్ కాదని ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. పీఆర్ మెయింటేన్ చేయడం తనకు కష్టమైన పనిగా అనిపిస్తుందని పేర్కొంది. నెక్ట్ ఇయర్ తన రెండు మూవీస్ రాజా సాబ్, హరి హర వీరమల్లు రిలీజ్ అవుతాయని, ఆ రెండు చిత్రాలతో నాయికగా ప్రేక్షకులకు మరింత చేరువవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. ఈ రెండు చిత్రాలతో పాటు మరో సర్ ప్రైజింగ్ మూవీ కూడా ఉందని తెలిపింది.

Advertisement GKSC

Advertisement
Tags :
Author Image