కేరళలో మీరిచ్చిన గ్రాండ్ వెల్‌కమ్ జీవితంలో మరిచిపోలేను: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
పుష్ప-2 ది రూల్ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలవబోతుంది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఈవెంట్ సన్సేషన్ అవుతుంది.
ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. చెన్నయ్‌లో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. ఐకాన్ స్టార్ ఎక్కడికి వెళితే అక్కడ ఆయన అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలుకుతున్నారు. తాజగా ఈ చిత్రం మరో గ్రాండ్ ఈవెంట్ కేరళలోని కొచ్చిలో ఎంతో ఘనంగా జరిగింది. కేరళలో మల్లు అర్జున్‌గా అత్యధిక అభిమానులు ఉన్న తెలుగు హీరోగా పేరున్న అల్లు అర్జున్‌కు అక్కడ అశేష జనాదరణ లభించింది. ఈ వేడుకలో ఐకాన్‌స్టార్ అభిమానులు ఎంతో సందడిగా కనిపించారు. ఈ సందర్భంగా
అల్లు అర్జున్ మాట్లాడుతూ:థ్యాంక్యూ కేరళ. మీ అడెంప్టెడ్ సన్ మల్లు అర్జున్‌కు మీరిచ్చిన ఈ గ్రాండ్ వెలకమ్ మరిచిపోలేనిది. గత 20 ఏండ్ల నుంచి మీరు నాపై ప్రేమ చూపిస్తున్నారు. ఈ సినిమా కెరీర్‌లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రంలో మలయాళ గొప్ప నటుడు ఫహాద్ ఫాజిల్‌తో పనిచేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో ఆయన నటన చూసి మీరంతా గర్వపడతారు. నా సినిమా కోసం మీరు మూడేళ్లు గా వెయిట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. తప్పకుండా ఇక నుంచి తొందరగా సినిమాలు చేస్తాను. ఈ సినిమాలో రష్మిన తన నటనతో ఈ మెప్పిస్తుంది. రష్మికతో పనిచేయడం ఎంతో కంఫర్ట్‌గా అనిపించింది. రష్మిక ప్రజెన్స్‌తో సినిమా చాలా బెటర్ అయ్యింది. సుకుమార్ నా కెరీర్‌లో ఆర్యను ఇచ్చాడు. ఆర్య చిత్రంతోనే నా మార్కెట్ కేరళలో స్టార్ట్ అయ్యింది. దర్శకుడు సుకుమార్ వల్లే నేను మీకు దగ్గరయ్యాను. నా కెరీర్‌లో దేవి శ్రీప్రసాద్ ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చాడు.
నా చిత్రానికి పనిచేసిన మలయాళీ రైటర్స్ కూడా.. చాలా థ్యాంక్స్. మైత్రీ నవీన్, రవి, చెర్రీలకు వారి సపోర్ట్ వల్ల ఈ సినిమా సాధ్యమైంది. ఓ రోజు దేవిశ్రీప్రసాద్‌కు ఫోన్ చేసి నా కేరళ ఆడియన్స్‌కు ప్రేమ చూపించాలి అన్నాను. ఈ సినిమాలో మలయాళ లిరిక్స్‌తో ఓ సాంగ్‌ను చేశాం. అన్నిభాషల్లో మలయాళం లిరిక్స్ ఉంటాయి. ఇది మలయాళ ప్రేక్షకులకు ఈ రూపంలో ప్రేమ చూపిస్తున్నాను. మలయాళీ ఫ్యాన్స్ ఆర్మీ అనే పదాన్ని స్టార్ట్ చేశారు. డిసెంబరు 5న పదకొండు వేలకు పైగా థియేటర్‌లో విడుదలవుతోంది.. మలయాళంలో చేసిన ఈ పాటలో వింటేజ్ బన్నీని చూస్తారు. పుష్ప పాత్రలో పుష్ప-1లో డ్యాన్సులు చేయడం కుదరలేదు. ఈ పాటలో నా డ్యాన్స్ వింటేజ్ బన్నీని చూస్తారు. ఆరు లాంగ్వేజ్‌ల్లో ఈ పాట మలయాళంలోనే హుక్ లైన్ ఉంటుంది. వైల్డ్ ఫైర్‌తో సినిమా ఉంటుంది. ఎంజాయ్ చేయండి' అన్నారు. అల్లు అర్జున్ స్పీచ్‌కు ముందుగా మలయాళంలో మాట్లాడి అభిమానులను హుషారెత్తించారు.