Cyberabad News : గంట వ్యవధిలో ఛేదించిన సైబరాబాద్ పోలీసులు ?
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సైబరాబాద్ పోలీసులు : ఆడుకుంటూ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిన బాలుడిని గంట వ్యవధిలో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.
(13.04.2024) రోజున మధ్యాహ్నం 1 గంటల సమయంలో 3 ½ వయస్సు ఉన్న ఒక బాబు, పేరు Master J.Harisva, S/o Mahesh, R/o. Kondapur, ఇంటి నుండి తప్పిపోయాడు. సదరు బాబు కొండా పూర్ లో ఉన్న White Filed రోడ్డులో అయోమయంగా తిరుగుతుండగా, అదే సమయము లో అటుగా వెళుతున్న బాటసారి రాజశేఖర్ బాలుడిని గమనించి వివరాలు అడగగా తాను తప్పిపోయానని వివరాలు సరిగ్గా చెప్పలేకపోయాడు. రోదిస్తున్న ఆ బాలుడిని మాదాపూర్ డిసిపి ఆఫీసుకు తీసుకు వెళ్లి అప్పగించారు.
మాదాపూర్ డిసిపి డాక్టర్ జి వినీత్, ఐపీఎస్., సూచనల మేరకు.. మాదాపూర్ ఇన్ స్పెక్టర్ జి. మల్లేష్ మరియు సిబ్బంది తప్పిపోయిన బాలుడి తల్లితండ్రుల వివరాలు సేకరించి, గంట వ్యవధిలో బాలుడిని వారికి తల్లిదండ్రులకు అప్పగించటము జరిగినది. ఈ సందర్భంగా వెంటనే స్పందించి బాలుడిని, పోలీసుల దగ్గరకు చేర్చిన రాజశేఖర్ ని మాదాపూర్ డిసిపి అభినదించారు.