For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కొత్త సంవత్సరాది "ఉగాది" పచ్చడి ఆరోగ్య రహస్యం.

02:54 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:54 PM May 11, 2024 IST
కొత్త సంవత్సరాది  ఉగాది  పచ్చడి ఆరోగ్య రహస్యం
Advertisement

🌺 ఉగాది ఆరు రుచులు ఆరోగ్య రహస్యం 🌺

ఉగాది అనగానే గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలోని ఆనంద, విషాదాలకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యదాయినులని ఆయుర్వేదం చెబుతున్నది. వేపపూవు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతులాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.
మన నాలుక గ్రహించగలిగే ఆరు రుచులను షడ్రుచులు అంటారు. అవి మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు (కారం), తీక్తం (చేదు), కషాయం (వగరు). ఆరోగ్యపరంగా ఒక్కొక్క రుచికి రకరకాల అనారోగ్యాలను హరించే గుణాలున్నాయి.
ఉగాది పచ్చడిలో ఆరోగ్యం..
వేప పూవు ఉగాది పచ్చడిలోని ప్రధాన ద్రవ్యం. దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు. అవి అందించే ఆరోగ్యం ఏంటో చూద్దాం.

Advertisement GKSC

🌸 తీపి 🌸

వాత, పిత్త హరిణి. తీపి శరీరానికి అవసరమైన బలాన్ని అందించి పోషిస్తుంది. తల్లి పాలను వృద్ధిపరుస్తుంది. దప్పిక, మూర్ఛలను తగ్గిస్తుంది. మంటలనుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది.

🌺 పులుపు 🌺

వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. గుండెకు మేలు చేసే పులుపు పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది. శుక్రాన్ని తగ్గిస్తుంది. రుచి కోల్పోయిన నాలుకను ఉత్తేజితం చెందిస్తుంది.

🌸 ఉప్పు 🌸

వాతహరిణి. మలబద్ధకాన్ని నివారించి ఆకలిని పెంపొందిస్తుంది. కఫాన్ని, కంటి ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. శుక్రనాశకంగా పనిచేస్తుంది.

🌺 కారం 🌺

ద్రవరూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల్లోని పురుగులను చంపి ఆకలిని పెంచుతుంది. రుచిని పుట్టిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. కాని ఎక్కువగా తీసుకుంటే రస రక్తాది ధాతువులు దెబ్బతింటాయి.

🌸 చేదు 🌸

కఫహారం, పిత్తాహారం, క్రిమిహారం, జ్వరహారం. విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. తల్లిపాలలోని దోషాలను తగ్గిస్తుంది. దప్పికను, దురదలను, మంటలను పోగొడుతుంది. చర్మవ్యాధులనుంచి ఉపశమనం కలిగిస్తుంది.

🌺 వగరు 🌺

శేలష్మ, రక్త, పిత్తాల బాధను తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది. అధిక స్రావాలను ఆపుతుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం శుక్రకణాలను నష్టపరుస్తుంది.

🔻 బెల్లం (తీపి): జిడ్డు లక్షణం కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్నిస్తుంది. వీర్యవృద్ధి కలిగిస్తుంది.

🔻 కొత్త చింతపండు (పులుపు): తేలికగా ఉండే చింతపండు కూడా వాతాన్ని తగ్గిస్తుంది. విరేచనకారకం, వాపును ఐక్యం చేస్తుంది.

🔻 ఉప్పు: కఫహారం, విషాహారం, మలమూత్రాలలో ఇబ్బందులను తొలగిస్తుంది.

🔻 మిరియాలు (కారం): కఫవాతహారం, ఆకలిని పెంచుతుంది. శుక్రకణ నాశిని.

🔻 వేపపూవు (చేదు): కఫ పిత్తాదులను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దగ్గు, వ్రణాలు, జ్వరానికి చాలా మంచిది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది.

🔻 పచ్చిమామిడి (వగరు): కషాయరసం కలిగినది. విరేచనాలను తగ్గిస్తుంది. బహుమూత్రత్వాన్ని నిరోధిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.

ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు. ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి, నూతన సంవత్సరంతోపాటు నూతనోత్తేజాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం.

🌴🎋🌿 🍃🌾🍃 🌿🎋🌴

Advertisement
Author Image