For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

politics తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన గవర్నర్ తమిళిసై..

12:18 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:18 PM May 13, 2024 IST
politics తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన గవర్నర్ తమిళిసై
Advertisement

politics గత కొన్నాళ్లుగా తెలంగాణలో ప్రగతి భవన్, రాజ్ భవన్‌ మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదని గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు.

అయితే తాజాగా రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడిన తమిళిసై తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని.. జరుగుతున్న విషయాలు అందరికీ తెెలియాలనే బాధను వ్యక్తం చేస్తున్నానని తమిళిసై స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకొని మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. అయితే ప్రభుత్వం తనపై ఎంత వివక్ష చూపించిన తన పని తాను చేసుకుంటూ పోతానని ఇవన్నీ పట్టించుకోనని తెలిపారు. తెలంగాణలో విద్య కోసం.. అభివృద్ధి కోసం తను ఎంతో కృషి చేశానని.. కానీ ఇవేమీ ప్రభుత్వం పట్టించుకోకపోయినా తనకు బాధ లేదని.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనకు ఎంత మాత్రం విలువ ఇవ్వకపోవడం చాలా బాధిస్తుందని వాపోయారు.

Advertisement GKSC

"ఎక్కడికి వెళ్లినా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు. మేడారం జాతరకు వెళ్తానంటే హెలికాప్టర్ ఏర్పాటు చేయమంటే చేయలేదు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో ఎన్నో ప్రజా సమస్యలను తీర్చాను. యూనివర్సిటీలో విద్యాసంస్థల్లో జరిగే వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించాలని చూస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఎలాంటి స్పందన లేదు" అని వాపోయారు.

Advertisement
Author Image