For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలంగాణ విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతీ లో నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం

12:06 AM Oct 01, 2021 IST | Sowmya
Updated At - 12:06 AM Oct 01, 2021 IST
తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతీ లో నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం
Advertisement

రాష్ట్ర మంత్రులు శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ గార్లు తెలంగాణ విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతీ లో నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం - ప్రథమ మహాసభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకవస్తున్నారన్నారు. BC ల ఆత్మగౌరవం కోసం BC ఆత్మగౌరవ భవనాలకు 80 ఎకరాల భూమి, భవనాల నిర్మాణం కోసం 80 కోట్ల రూపాయల ను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కిందన్నారు. విశ్వబ్రాహ్మణ ల కోసం ఉప్పల్ బాగాయత్ లో 5 ఎకరాల భూమి, 5 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. BC, SC, ST, మైనారిటీల వర్గాలకు విద్యను అందించేoదుకు వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. విశ్వకర్మ లను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సీఎం కేసీఆర్ గారు ప్రోత్సాహిస్తున్నారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

Advertisement GKSC

https://www.teluguworldnow.com/?p=4828&preview=trueఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, డా. వెంకట చారి, డా. మదన్ మోహన్ ఆచార్య, చోల్లేటి కృష్ణమా చారి, రాగబడి రవీంద్ర చారి, దానకర్ణ చారి, రవి చారి తదితరులు పాల్గొన్నారు.

https://www.teluguworldnow.com/?p=4828&preview=true

Advertisement
Author Image