For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హైద్రాబాద్ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్ట్ లకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను: మంత్రి కేటిఆర్

02:12 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:12 PM May 11, 2024 IST
హైద్రాబాద్ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్ట్ లకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను  మంత్రి కేటిఆర్
Telangana Press Academy Chairman Allam Narayana Meeting With Minister KTR about Journalists Problems, Kranthi Kiran, TEMJU,
Advertisement

జర్నలిస్ట్ ల సమస్యలపై కె టి ఆర్ తో సమావేశమైన ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ.

పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ తోజర్నలిస్ట్ ల సమస్యలపై కె టి ఆర్ తో సమావేశమైన అల్లం నారాయణ

Advertisement GKSC

పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ తో సమావేశమయ్యారు. కరోన సమయంలో బాధిత జర్నలిస్ట్ లకు ఒక్కొక్కరికి 20000 చొప్పున అందజేసిన ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ గారిని మంత్రి కే టి ఆర్ గారు అభినందించారు. ఈ సందర్భంగా ఇతర సమస్యలను కూడా కె టి ఆర్ గారు ఆడిగితెలుసుకున్నారు. 1. ప్రెస్ అకాడమీ కి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించడం 2. జిల్లా కేంద్రాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్ట్ లకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడం 3. హైద్రాబాద్ లోని జర్నలిస్ట్ లకు ఇల్లు కల్పించడం, జవహర్ లాల్ నెహ్రు సొసైటీ కి పెట్ బషీరాబాద్ లోని స్థలాన్ని కేటాయించడం 4. చిన్న పత్రికల గ్రేడింగ్ తో పాటు అనేక సమస్యలపై మంత్రిగారు చర్చించారు. ఈ సందర్బంగా ఈ నెల 7 వ తేదీన చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాల సహాయనిది అందజేసే కార్యక్రమనికి హాజరుకావాలని ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ కె టి ఆర్ ను కోరగా అంగీకరించారు.. జర్నలిస్ట్ ల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని దేశంలో ఎక్కడా ఏ ప్రెస్ అకాడెమీ కూడా పనిచేయని విధంగా తెలంగాణ మీడియా అకాడమీ పనిచేస్తూ ప్రభుత్వం సహకారంతో అనేక రకాలుగా సహాయసహకారాలు అందిస్తున్నదని ఈ సందర్భంగా
కె టి ఆర్ గుర్తుచేశారు. మిగిలిన సమస్యలన్నింటిని కూడా కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని ఇళ్ల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగా ఉన్నారని కె టి ఆర్ గారు చెప్పారు. సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ,ఎల్ ఎల్ ఏ లు క్రాంతి కిరణ్, బాల్క సుమన్, టి యు డబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, TEMJU అధ్యక్ష కార్యదర్శులు ఇస్మాయిల్ రమణ, హైద్రాబాద్ యూనిట్ అధ్యక్షుడు యోగనందం మరియు ఫోటో జర్నలిస్ట్ అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement
Author Image