For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sports News: వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్ లో తెలంగాణ నుంచి ఇద్దరు క్రీడాకారులు: మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్

12:39 PM Nov 23, 2021 IST | Sowmya
UpdateAt: 12:39 PM Nov 23, 2021 IST
sports news  వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్ లో తెలంగాణ నుంచి ఇద్దరు క్రీడాకారులు  మంత్రి శ్రీ v  శ్రీనివాస్ గౌడ్
Advertisement

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో అక్టోబర్ 18 నుండి 23 వరకు ఈజిప్టు రాజధాని కైరో లో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్ లో సబ్ జూనియర్ విభాగంలో మన రాష్ట్రానికి చెందిన బాలికల విభాగంలో లహరి M. గిరీష్ (13 years) 45 KG , బాలుర విభాగంలో ఆశిష్ చంద్ (54 KG) లను సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడల సమగ్ర అభివృద్ధి కి సీఎం కేసీఆర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడల ను, క్రీడాకారులను తయారు చేస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

Advertisement

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్, కిక్ బిక్సింగ్ కోచ్ లు అరుణ్ సింగ్, అవినాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Kick Boxers Lahari M Girish,Ashish Chand in World Kickboxing Championship 2021 Egypt,Minister V Srinivas Goud,Telangana News,v9 news telugu,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com1

Advertisement
Tags :
Author Image