For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: విద్యుదుత్పత్తిలో తెలంగాణ టాప్‌, కేటీపీపీలో నూతన క్వార్టర్ల ప్రారంభం: టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

05:53 PM Sep 15, 2021 IST | Sowmya
Updated At - 05:53 PM Sep 15, 2021 IST
telangana news  విద్యుదుత్పత్తిలో తెలంగాణ టాప్‌  కేటీపీపీలో నూతన క్వార్టర్ల ప్రారంభం  టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
Advertisement

Telangana Governament No1 State in Power Distribution, CMD Prabhakar Rao, TSGENCO, ACHP Chemical Labs, Kakatiya Thermal Power Station, Gandra Venkatram Reddy MLA, Telangana News, Telugu World Now,

Telangana News: విద్యుదుత్పత్తిలో తెలంగాణ టాప్‌, కేటీపీపీలో నూతన క్వార్టర్ల ప్రారంభం: టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

Advertisement GKSC

విద్యుదుత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో ఉద్యోగుల కోసం నిర్మించిన 430 క్వార్టర్ల సముదాయం, ఏసీహెచ్‌పీ కెమికల్‌ ల్యాబ్‌ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం కేటీపీపీలోని పలు విభాగాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను సీఎండీ పరిశీలించారు. సర్వీస్‌ భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్లలో బొగ్గు నిల్వ లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ మేరకు అంతరాయం లేకుండా ఉత్పత్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందిస్తున్నదన్నారు. అందుకు అనుగుణంగా టీఎస్‌ జెన్‌కో కృషి చేయాలని సూచించారు.

Telangana Governament N01 State in Power Distribution,CMD Prabhakar Rao,TSGENCO,ACHP CHemical Labs,Kakatiya Thermal Power Station,Gandra Venkatram Reddy,mla,V9 News Telugu,

Advertisement
Author Image