For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఓపెన్ హౌస్ విజిట్

09:36 AM Jun 08, 2023 IST | Sowmya
Updated At - 09:36 AM Jun 08, 2023 IST
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఓపెన్ హౌస్ విజిట్
Advertisement

విజిట్ లో పాల్గొన్న విద్యార్థినిలకు అవగాహన కల్పించిన W&CSW డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు., జూన్ 7 వ తేదీన సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు (W&CSW) విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థినిలకు ఓపెన్ హౌస్ విజిట్ ఏర్పాటు చేయడం జరిగింది.

Advertisement GKSC

ఈ సందర్భంగా డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., గారు మాట్లాడుతూ ... ఓపెన్ హౌస్ విజిట్ లో భాగంగా వివిధ కళాశాలకు చెందిన 110 మంది విద్యార్థినిలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

కళాశాలల విద్యార్థినిలకు విమెన్ పోలీస్ స్టేషన్, షి టీమ్ పోలీస్ స్టేషన్ మరియు భరోసా కేంద్రాలను చూపిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ముఖ్యంగా విమెన్ సేఫ్టీ, విమెన్ సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ మరియు చైల్డ్ సేఫ్టీ వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు. ఆడియో & వీడియో విజువల్స్ ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా అవగహనా కల్పించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీ నితికా పంత్, ఐపీఎస్., విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ ఇన్స్ స్పెక్టర్ వెంకటేశం, ఇన్స్ స్పెక్టర్ వేణుమాధవ్, విమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ సునిత మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Author Image