For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా "దళిత బంధు పథకం": ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

03:10 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:10 PM May 11, 2024 IST
కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా  దళిత బంధు పథకం   ముఖ్యమంత్రి శ్రీ కె  చంద్రశేఖర్ రావు
Advertisement

Telangana Dalitha Bandu, SC Corporation Chairman Bandaru Srinivas, Telangana News, Telugu World Now,

కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా "దళిత బంధు పథకం": ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

Advertisement GKSC

కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా 'దళిత బంధు పథకం' రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం పిలుపునిచ్చారు.

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా శ్రీ బండా శ్రీనివాస్ ను నియమించిన నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఉద్దేశించి సమావేశంలో మాట్లాడారు.

telangana talitha bandumsc corporation chairman bandaru srinivas,telangana news,v news telugu,teluguworldnow.com,cm kcr.2

telangana talitha bandumsc corporation chairman bandaru srinivas,telangana news,v news telugu,teluguworldnow.com,cm kcr.

Advertisement
Author Image