ఫార్మా, ఐటీ తరహాలో సినిమాలకు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడమే సీఎం లక్ష్యం : దిల్ రాజు
DIL RAJU : టాలీవుడ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలోని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు గురువారం (డిసెంబర్ 26) ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు.
సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు సీఎం రేవంత్ రెడ్డి విలువైన మార్గదర్శకత్వం, సూచనలు అందించారని దిల్ రాజు వెల్లడించారు. ఈ మేరకు దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఈ భేటీపై వస్తున్న నెగెటివ్ వార్తల్లో నిజం లేదు. జరగని ఘటనలను జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 0.5% వ్యతిరేకత కూడా లేదు. నిజానికి సినిమా పరిశ్రమకి ఈ ప్రభుత్వం చాలా మద్దతునిస్తోంది.
సీఎం గారు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు కోసం తన సలహాలు, సూచనలను పంచుకున్నారు. హైదరాబాద్‌ను భారతీయ సినిమాకే కాకుండా హాలీవుడ్ నిర్మాణాలకు కూడా హబ్‌గా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మేము ఆయనిచ్చిన సలహాలు,సూచనలపై దృష్టి పెడతాం. తదుపరి సమావేశంలో వివరణాత్మక ప్రతిపాదనను ఆయన ముందు ఉంచుతామ’ని అన్నారు.
దిల్ రాజు : ఎఫ్.డి.సి చైర్మన్
సీఎం తో భేట్ అయిన తరువాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయి
సీఎం మీటింగ్ లో అసలు జరగని వి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారు
సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చాలా బాగా జరిగింది
0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ లేదు
సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు
బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదు
పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు ప్రదర్శించలేదు
బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు ప్రతిదీ అకౌంట్ బిలిటీగా ఉండాలి అని డీజీపీ సూచించారు
హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం అన్నారు
హైదరాబాద్ కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమకూడా అంతే కీలకం గా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు.
సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని చెప్పారు
అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని చెప్పారు.