For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

National News: దేశంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ మూడు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు చోటు: కేంద్ర నీతి ఆయోగ్ ప్రశంసలు

10:20 PM Dec 27, 2021 IST | Sowmya
Updated At - 10:20 PM Dec 27, 2021 IST
national news  దేశంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ మూడు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు చోటు  కేంద్ర నీతి ఆయోగ్ ప్రశంసలు
Advertisement

అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి దేశంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబర్చిన మూడు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు చోటు దక్కడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న కేంద్ర నీతి ఆయోగ్ సోమవారం తాజాగా ప్రకటించిన తన నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రతిభను కొనియాడింది, దేశంలో బెడిట్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన మూడు పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ వరుస మూడు స్థానాల్లో నిలిచాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement GKSC

ప్రణాళికా బద్దంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పని తీరు వల్లే తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచిందని వినోద్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని వినోద్ కుమార్ అన్నారు.Best Performance in the Country Telangana in the three big states,NITI WB Health Index Report.NITI Aayog,CM KCR,teluguworldnow.com,telugu golden tv,దేశంలో అగ్రభాగాన నిలిచిన మూడు రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోని ప్రభుత్వాలే కావడం గొప్ప విషయం అని వినోద్ కుమార్ వివరించారు.

Advertisement
Author Image