For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tech News : ఫేక్ కాల్స్ తో ఇబ్బంది పడుతున్నారా... ఈ ట్రిక్ మీకోసమే !

12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
tech news   ఫేక్ కాల్స్ తో ఇబ్బంది పడుతున్నారా    ఈ ట్రిక్ మీకోసమే
Advertisement

Tech News : ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అనేది నిత్యవసర వస్తువులా మారిపోయింది. సిటీల నుంచి గ్రామ స్థాయి వరకు సెల్ ఫోన్ ను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. కాగా ఏదైనా పనిలో ఉన్నప్పుడు, ముఖ్యమైన మీటింగ్స్ లో ఉన్నప్పుడు స్పామ్‌ కాల్స్‌ అనేవి బాగా ఇబ్బందిపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా స్పామ్ కాల్స్ గురించి చెప్పాలంటే ఇవి మూడు రకాలుగా ఉంటాయి. వాటిలో టెలీ మార్కెటింగ్‌ కాల్స్‌, రోబో కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌.

వీటిలో స్పామ్‌ కాల్స్‌లో కొన్ని వినియోగదారులను మోసం చేసేవే ఉంటాయి. కాల్స్‌ చేస్తూ యూజర్లను తప్పు దారి పట్టిస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత లోన్స్‌ ఇప్పిస్తాము, జాబ్‌ ఆఫర్స్‌ ఉన్నాయి అంటూ రకరకాలుగా ప్రజలను మభ్యపరిచి డబ్బులు కాజేస్తుంటారు. అయితే ఇలాంటి కాల్స్‌ రాకుండా ఉండడానికి ఆండ్రాయిడ్‌ ఓ సెక్యూరిటీ ఫీచర్‌ను అందించింది. ఇందులో భాగంగా కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్‌ అనే రెండు ఫీచర్లను గూగుల్‌ అందిస్తోంది. వీటి ద్వారా యూజర్లు స్పామ్‌ కాల్స్‌ నుంచి బయటపడొచ్చు. ఆ ఫీచర్‌ను ఎలా ఒకే చేయాలో మీకోసం ప్రత్యేకంగా...

Advertisement GKSC

  • ముందుగా ఫోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • అనంతరం కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి.
  • అందులో కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని, దాన్ని ఎనేబుల్ నొక్కాలి.
  • అనంతరం అగ్రీ బటన్‌పై క్లి్‌క్‌ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది.
  • ఇక మరో ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకోవడానికి ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కింద ఉన్న రీసెంట్స్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత మీకు వచ్చిన స్పామ్‌ కాల్‌ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్‌, మెసేజ్‌, వీడియో, ఐ అని ఐకాన్స్‌ కనిపిస్తాయి.
  • వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి.
  • స్పామ్‌ కాల్‌ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్‌ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, దాని నుంచి మీకు మరోసారి ఫోన్‌కాల్స్‌ రాకుండా చేయొచ్చు.
Advertisement
Author Image