For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'విద్య వాసుల అహం' (ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరి) ఆహాలో త్వరలో

Teaser Release of 'Vidya Vasula Aham' Unveils Intriguing Couple Drama
11:48 PM May 09, 2024 IST | Sowmya
Updated At - 11:48 PM May 09, 2024 IST
Teaser Release of 'Vidya Vasula Aham' Unveils Intriguing Couple Drama
 విద్య వాసుల అహం   ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరి  ఆహాలో త్వరలో
Advertisement

కపుల్ డ్రామాతో మన ముందుకు వస్తున్నారు రాహుల్ విజయ్, శివాని, అసలు పెళ్ళంటే ఇష్టం లేని వాసు, విద్యని పెళ్లి చేసుకోవలిసి వస్తుంది, కపుల్ అన్నాక ఒకరు తగ్గాలి ఇంకొకరు నెగ్గాలి, కాని ఇద్దరూ నేనే నెగ్గాలి అని అనుకుంటే, అదే ఇగోకి పోతే, ఆ పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపధ్యలో కథ జరుగుతుంది. మరీ విద్య వాసులు ఇగోతోనే ఉంటారా లేదా పెళ్ళైన కొత్తలో ఉండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తారా అనేది ముందు ముందు వచ్చే అప్డేట్స్ లో చూడాలి.

ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో, తన్విక, జశ్విక క్రియేషన్స్ పై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలుగా ఈ సినిమా రాబోతుంది. మణికాంత్ గెల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. క్యారెక్టర్స మెచ్యుర్ గా ఆలోచించినప్పటికీ వారిద్దరి మధ్యలో ఈగో అనే వాల్ ని బ్రేక్ చెయ్యనంత వరుకు వారి దాంపత్య జీవితంలోకి వెళ్ళలేరు అనే పాయింట్ ని తీసుకుని, దాన్ని వెల్ ఎక్షెక్యుట్ చేసి ప్రేక్షకుల మన్నన పొందారు. ఈ ‘విద్య వాసుల అహం’  (ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరి)  ఆహాలో త్వరలో రిలీజ్ కాబోతుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Advertisement GKSC

తారాగణం :- రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్,  వైవ రాఘవ.

Advertisement
Author Image