For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది 'బ‌ర్త్‌డే బాయ్' టీజ‌ర్

04:53 PM Jul 01, 2024 IST | Sowmya
Updated At - 04:53 PM Jul 01, 2024 IST
ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది  బ‌ర్త్‌డే బాయ్  టీజ‌ర్
Advertisement

ప్రస్తుతం ప్రేక్ష‌కుల అభిరుచి మారింది. కొత్త‌ద‌నంతో కూడిన న్యూ ఏజ్ సినిమాల‌కు వాళ్లు ప‌ట్టం క‌డుతున్నారు. అందుకే ద‌ర్శ‌కులు కూడా వారి ప‌ల్స్‌ను ప‌ట్టుకుని విభిన్న‌మైన క‌థ‌ల‌తో, వైవిధ్య‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా అదే కోవ‌లో  మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల  ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ది బ‌ర్త్‌డే బాయ్‌. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేశారు. టీవీలో స్నేహితులు  బాలుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓపెన్ అయిన టీజ‌ర్, ఆ త‌రువాత ప‌లు ఎంట‌ర్‌టైనింగ్ స‌న్నివేశాల‌తో కొన‌సాగుతుంది. టీజ‌ర్ చూస్తుంటే కొత్త‌ద‌నంతో కూడిన సినిమాలా అనిపిస్తుంది. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ సినిమా చూడాల‌నే ఉత్సుక‌త‌ను క‌లిగించేలా టీజ‌ర్ క‌ట్ వుంది.

ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ... ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ప్ర‌తి పాత్ర‌, ప్ర‌తి స‌న్నివేశం కొత్త‌గా వుంటుంది. ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు  చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఐదుగురు స్నేహితుల‌కు ఎదురైన అనుభ‌వాలు, వాటి ప‌ర్య‌వ‌సానాలు చాలా ఆస‌క్తిక‌రంగా వుంటాయి. ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం.  కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండ‌బోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఈ నెల 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం* అన్నారు.

Advertisement GKSC

Cast : Ravi Krishna, Sameer Malla, and Rajeev Kanakala.

Crew :
Writer and Director – Whisky
Executive Producer – Bharath
Produced by Bomma_Borusa
DOP – Sankirth Raahul
Music Director – Prashanth Srinivas
Production Designer – AR Vamsi G
Editor – Naresh Adupa
Sync & Sound Design – Sai Maneendhar Reddy
Sound Mixing – Aravind Menon
Color Grading – Metin Okutay
Make-up Chief – Venkat Reddy
Publicity Designer – Omkar Kadiyum
Digital Marketing – First Show
PROs – Eluru Sreenu, Maduri Madhu

Advertisement
Author Image