For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా... అంటూ లెటర్ రాసి యువ నటి ఆత్మహత్య..

12:23 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:23 PM May 13, 2024 IST
movie జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా    అంటూ లెటర్ రాసి యువ నటి ఆత్మహత్య
Advertisement

Movie సినిమాల్లో అవకాశాలు రావటమే అరుదుగా ఉన్న ఈ రోజుల్లో మంచి అవకాశాలు వస్తూ తనకంటూ ఓ స్టేటస్ తెచ్చుకున్న కొందరు నటీనటులు సైతం మానసిక ఒత్తిడి ముందు తలవంచక తప్పట్లేదు. కెరీర్ పరంగా ఎంత మంచి స్థాయిలో ఉన్నా పర్సనల్ లైఫ్ లో వచ్చే సమస్యలకి లొంగిపోతున్నారు. తాజాగా ఓ యువ నటి మరణం కోలీవుడ్ లో అంశంగా మారింది.. ఇప్పుడిప్పుడే కెరియర్లో ఎదుగుతున్న ఈమె చని పోవడంతో కోలీవుడ్ షాక్ కు గురి అయింది.

తన అందం, అభినయంతో తమిళ ప్రేక్షకుల్ని అలరించిన యువ నటి దీప అలియాస్ పౌలిస్ (29) ఆత్మహత్య చేసుకున్నారు. సినిమాల్లో కొన్ని ప్రధాన పాత్రల్లో నటిస్తూ వస్తున్న ఈమె చెన్నైలో ఓ ప్రైవేట్ ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే శనివారం ఆమెకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూడగా.. ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించిన ఆమే అప్పటికే చనిపోయి ఉంది .. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ అక్కడ ఒక లెటర్ దొరికింది.. తన చావుకి ఎవరూ కారణం కాదని.. కానీ జీవితాంతం ఒక వ్యక్తిని మాత్రం ప్రేమిస్తూనే ఉంటానని రాసి ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఏంటి అన్న విషయం మాత్రం తెలియలేదు..

Advertisement GKSC

సినిమాల్లో సహాయ నటిగా, చిన్న చిన్న పాత్రల్లో కనిపించినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది దీప యువ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే కెరియర్లో స్థిరపడుతున్న ఈమె చనిపోవడంతో తమిళ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement
Author Image