For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తమన్నా భాటియా మల్టీ లింగ్వల్ మూవీ ఓదెల 2- ఓదెల విలేజ్ లో ఫైనల్ షెడ్యూల్

05:27 PM Oct 08, 2024 IST | Sowmya
Updated At - 05:27 PM Oct 08, 2024 IST
తమన్నా భాటియా మల్టీ లింగ్వల్ మూవీ ఓదెల 2  ఓదెల విలేజ్ లో ఫైనల్ షెడ్యూల్
Advertisement

తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్‌ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ సీక్వెల్ 'ఓదెల 2' లో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా వున్నారు. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ 'ఒదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్, బీహైండ్ ది స్క్రీన్ కంటెంట్‌తో సంచలనం సృష్టించింది. తన కెరీర్‌లో తొలిసారిగా తమన్నా ఈ సినిమాలో శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది.

ఓదెల2 చివరి షెడ్యూల్ ఓదెల విలేజ్ లో జరుగుతోంది. మహాదేవుని ఆశీస్సులతో కాశీలో ప్రారంభమైన ఈ థ్రిల్లింగ్ సీక్వెల్ ఇప్పుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుగుతోంది. టీం ఐకానిక్ ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తమన్నా మొదటి సారి ఓదెల విలేజ్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ చివరి షెడ్యూల్‌ను రూపొందించడానికి సహకరించిన ఓదెల గ్రామస్తులకు మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement GKSC

సంపత్ నంది సూపర్ విజన్ లో ఓదెల 2 ఎమోషనల్ డెప్త్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్‌తో నిండిన గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.

Cast : Tamannaah Bhatia, Hebah Patel, Vasishta N Simha, Yuva, Naga Mahesh, Vamshi, Gagan Vihari, Surender Reddy, Bhupal, and Pooja Reddy

Technical Crew : Producer: D Madhu , Created by: Sampath Nandi , Banners: Madhu Creations and Sampath Nandi Teamworks , Director: Ashok Teja , DOP: Soundar Rajan. S , Music Director: Ajaneesh Loknath , Art Director: Rajeev Nair , PRO: Vamsi-Shekar , Marketing: First Show

Advertisement
Author Image