టైలరింగ్ సెంటర్, బ్యాండ్ పార్టీ వసతి గది ని ప్రారంభించిన సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మరియు శ్రీమతి అనుప వీ సజ్జనార్.
02:01 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 02:01 PM May 03, 2024 IST
Advertisement
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని సీఏఆర్ హెడ్ క్వార్టెర్స్ లో ఈరోజు టైలరింగ్ సెంటర్ మరియు బ్యాండ్ పార్టీ వసతి గదిని ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మరియు శ్రీమతి అనుప వీ సజ్జనార్.
సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ సిబ్బంది కోరిక మేరకు వారి సౌకర్యార్థం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో 4 కుట్టు మిషన్ల తో టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు.
కమీషనర్ గారి సూచనల మేరకు గతంలో 17 మంది సభ్యులతో ఏర్పాటైన బ్యాండ్ పార్టీ బస నిమిత్తం వారికి వసతి కల్పించదాంతో పాటు వారికి బ్యాండ్ పార్టీకి అవసరమైన పరికారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీ ఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీ లక్ష్మి నారాయణ, ఆర్ఐ లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement