#SVC59 : స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ మూవీ అనౌన్స్ మెంట్
01:18 PM May 04, 2024 IST | Sowmya
Updated At - 01:18 PM May 04, 2024 IST
Advertisement
స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది.
ఈ రోజు ఈ సినిమాను లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.
నటీనటులు : విజయ్ దేవరకొండ, తదితరులు..
టెక్నికల్ టీమ్ :
బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు - దిల్ రాజు, శిరీష్
రచన దర్శకత్వం - రవికిరణ్ కోలా
Advertisement