For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Superstar Krishna's Birth Anniversary Celebrations under the Auspices of Beauty Movie Team

07:12 PM May 31, 2024 IST | Sowmya
Updated At - 07:12 PM May 31, 2024 IST
superstar krishna s birth anniversary celebrations under the auspices of beauty movie team
Advertisement

సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి వేడుకలను "బ్యూటీ" చిత్ర యూనిట్ ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాలా సుబ్రహ్మణ్యమ్, కెమెరామేన్ సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ రౌతు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ రౌతు మాట్లాడుతూ… సూపర్ స్టార్ కృష్ణ గారికి నేను వీరభిమానిని, కృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన కృషి అనిర్వచనీయం అని ప్రశంసించారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో ఒక్కో జోనర్ లోనే ఎక్కువ సినిమాలను ఎంపిక చేసుకుని వెళ్తున్న రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కథలను ఎంపిక చేసుకొని ట్రెండ్ ని మార్చారన్నారు.

Advertisement GKSC

అంతేకాదు డైరెక్టర్స్ హీరోగా ఆయనకు సౌత్ ఇండియాలోనే పేరు ఉండేది. ఆఖరి నిముషంలో నిర్మాతలు బ్యాలన్స్ డబ్బులు ఇవ్వలేకపోయినా కృష్ణ గారు సౌమ్యంగా అర్ధం చేసుకొని వదిలేసేవారు. పౌరాణిక పాత్రలైన.. రొమాంటిక్ పాత్రలైన ఒక చెల్లికి అన్నగా.. కూతురికి తండ్రిగా ఎటువంటి పాత్రలనైనా సరే ఆయన అవలీలగా నటించి మెప్పించారు. చాలామంది స్టార్ హీరోస్ డైరెక్టర్లు చెప్పిన వాటికి కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వంక పెట్టి ఓకే చెప్పేవారు కాదు. కానీ కృష్ణ గారు డైరెక్టర్లు ఏమి చెప్తే అది చేసేవారు . డైరెక్టర్స్ ను నమ్మి జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఇండస్ట్రీలో అనేక రికార్డులను నెలకొల్పారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమాలు చూస్తూ మనం ఆనందిస్తున్నామంటే కారణం ఆయన అవలంభించిన కొత్త తరహా నటనా విధానాలు, ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ ఆయన నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలే అని ప్రకాష్ కొనియాడారు.

సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్స్ :

  1. అల్లూరి సీతారామరాజు' తొలి తెలుగు సినిమా స్కోప్‌ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
  2. 1972లో తెరకెక్కిన 'గూడుపుఠానీ' మూవీ తొలి ORW కలర్ మూవీ కూడా సూపర్ స్టార్ కృష్ణ చిత్రం కావడం విశేషం.
  3. మోసగాళ్లకు మోసగాడు.. 1971లో పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో తొలి కౌబాయ్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
  4. తెలుగులో తొలి స్కోప్ టెక్నోవిజన్ టెక్నాలజీలో ఔట్ డోర్ షూటింగ్ జరుపుకున్న చిత్రం 'సాక్షి'. 1967లో విడుదలైన ఈ ఈ మూవీ విజయం సాధించింది.
  5. గూఢచారి 116.. తెలుగులోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి జేమ్స్ బాండ్ చిత్రంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 రికార్డులకు ఎక్కింది. 1966లో ఈ సినిమా విడుదలైన సంచలన విజయం నమోదు చేసింది.
  6. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పరిచయమైన తొలి సినిమా 'తేనే మనసులు'. ఆదుర్తి సుబ్బారావు దర్శ సినిమా.. తెలుగులో మొదటి సాంఘిక రంగుల చిత్రం.
Advertisement
Author Image