Duet Movie : ఘనంగా ప్రారంభమైన హీరో ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్ 'డ్యూయెట్'
స్టార్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "డ్యూయెట్" ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో లావిష్ మేకింగ్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దగ్గర పనిచేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ "డ్యూయెట్"తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో "డ్యూయెట్" సినిమా ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్,హీరో సత్య దేవ్ ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి అతిథులుగా హాజరయ్యారు. మూహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ నివ్వగా...దర్శకుడు సాయిరాజేశ్, జ్ఞానవెల్ రాజా , సహ నిర్మాత మధుర శ్రీధర్ స్క్రిప్ట్ ను దర్శకుడు మిథున్ కి అందజేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ చందూ మొండేటి చేశారు. ఆనంద్ పేరెంట్స్ గోవర్ధన్ దేవరకొండ మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.