ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024లో ఐదుగురు విద్యార్థుల ప్రతిభ
హైదర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024కి ఎంపికైన విద్యార్థులు, హైదర్‌నగర్‌లోని ZPHS నుండి ఐదుగురు విద్యార్థులు అక్టోబర్ 20వ తేదీన హైదరాబాద్‌లో జరిగే 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ నుండి ఛాంపియన్‌షిప్‌ల చీఫ్ ఇన్‌చార్జ్‌గా ఉన్న Dr. P Srinivas Kumar స్వయంగా హైదర్‌నగర్‌లోని ZPHSకి వెళ్లి జ్ఞాపకశక్తిపై సెమినార్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి selections నిర్వహించి ఎంపిక చెయ్యడం జరిగింది.
ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారని, ఈ విద్యార్థులు సరైన ప్రోత్సాహంతో జాతీయ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పోటీ పడగలరని డాక్టర్ Dr. P Srinivas Kumar తెలిపారు. ఎంపికైన ఈ ఐదుగురు విద్యార్థులకు ఛాంపియన్‌షిప్ రుసుమును ViralPe Sales and Services Pvt. Ltd. స్పాన్సర్ చేయడం జరిగింది. Memory Sport గురించి తెలుసుకున్న వెంటనే తన పాఠశాలలో ప్రోత్సహించిన ZPHS, Hydernagar Principal K Sai Kumar గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ZPHS, Hydernagar ప్రిన్సిపల్ అయిన K Sai Kumar గారు మాట్లాడుతూ... తమ పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024కి ఎంపిక కావడం తమకు చాలా గర్వంగా ఉందన్నారు. తమ పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశం ఇచ్చిన IMSC ప్రెసిడెంట్ Squadron Leader Jayasimha గారికి మరియు తమ పాఠశాల సమయానికి అనుకునంగా అందుబాటులో ఉండి విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మరియు sponsors ని కూడా తానే ఏర్పాటు చేసిన Dr. P Srinivas Kumar గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ Championship ద్వారా తమ పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను గుర్తించి, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
Indian Memory Sports Council Championships ki Chief In Charge అయిన Dr. P Srinivas Kumar మాట్లాడుతూ... JNTUH నుండి Biotechnology లో Ph.D చేసిన తాను ఈ memory sport ను దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రతిభ గల వారిని కనుగొని శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నానని, తద్వారా ఒక రోజు భారతీయుడు ప్రపంచ మెమరీ ఛాంపియన్‌షిప్ గెలుపొందడం మనం చూడాలి అని, దానికి ప్రతి ఒక్కరి సహకారం కావలి అని కోరారు.
హైదర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024కి ఎంపికైన విద్యార్థులు : Madeena Mahek, R Lasya, N Anusha, N Mallikarjun, Samim Islam.