For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Viral News : చండీఘర్ లోని ఓ యునివర్సిటిలో దారుణం... భోజనంలో ఎలుక !

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
viral news   చండీఘర్ లోని ఓ యునివర్సిటిలో దారుణం    భోజనంలో ఎలుక
Advertisement

Viral News : విద్యార్ధులను ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు దూర ప్రాంతాలకు పంపించాలంటే పలు జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి అన్ని రకాల వసతులతో సహా ప్రశాంత వాతావరణంలో విద్యనభ్యసించాలని కోరుకుంటారు. అయితే అన్ని యూనివర్సిటీలలో సరైన సదుపాయాలు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే చండీఘడ్‌ లోని ఓ యూనివర్సిటీలో ఓ దారుణం జరిగింది. యూనివర్సిటీ మెస్‌ నిర్వాహకులు విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఈ ఘటన జరిగింది.

కాగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన యూనివర్సిటీలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఈ యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు . అయితే అన్ని విధాలుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ యూనివర్సిటీ విద్యార్ధులకు మాత్రం మెరుగైన భోజన సదుపాయాలను అందించడంలో విఫలమైంది. విద్యార్థులు తినే పప్పులో ఓ ఎలుక కనిపించడంతో విద్యార్ధులంతా షాక్ కి గురవుతున్నారు. దీనిపై ప్రశ్నించగా... ‘ఇది చాలా సాధారణమైన విషయం’ అని సమాధానమిచ్చారు. మెస్ నిర్వాహాకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement GKSC

ఈ విషయమై మెస్‌ నిర్వాహకులను సదరన్ స్పైస్ ఓనర్‌ను ప్రశ్నించగా... ఇది చాలా సర్వసాధారణ విషయం అన్నట్టు సమాధానం ఇచ్చారు. దీంతో హాస్టల్ విద్యార్థులంతా కలిసి నిరసన చేపట్టారు. ఇంకా నిర్లక్షంగా సమాధానమిచ్చిన మెస్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు... ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల గురించి ఆలోచించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Author Image